Published On: Mon, Sep 24th, 2018

స్మార్ట్ సిటీలు, పట్టణ ప్రాంత ప్రాజెక్టులపై సిఎస్ సమీక్ష

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజిమెంట్ లిమిటెడ్ (ఎపియుఐఎఎంఎల్) 11వ బోర్డు సమావేశం సోమవారం అమరావతి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి ఆకర్షణీయ నగరాల అభివృద్ధితో పాటు నూతనంగా ప్రకటించబడిన ఏలూరు స్మార్ట్ సిటీ, ఇతర పట్టణ ప్రాంత ప్రాజెక్టులపై సమీక్షించారు. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న జక్కంపూడి ఎకనమిక్ సిటీ (జెట్ సిటీ) ఫేజ్-1కు సంబంధించిన పనులపై చర్చించారు. అలాగే విజయవాడ నగరంలో రూ.90కోట్ల అంచనాతో 24గంటలు మంచినీటి సరఫరాకు ఉద్దేశించిన స్మార్ట్ రిలయబుల్ వాటర్ సప్లై పధకంపైనా సమావేశంలో చర్చించారు. పట్టణ ప్రాంతాల్లో ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వివిధ అంశాలపై సమావేశంలో సిఎస్ దినేష్‌కుమార్ సమీక్షించారు. బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి కరికల వలవన్, ఎపియుఐఎఎంఎల్ డైరెక్టర్ డాక్ట‌ర్ ఎస్.నారాయణన్ (రిటైర్డ్ ఐఎఎస్), ఎపియుఐఎఎంఎల్ సిఇఓ ప్రకాశ్ గౌర్, వీర్రాజు, వికాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Just In...