Published On: Wed, Apr 3rd, 2019

స్వరాజ్యమైదానంలో మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభం

* కొలువుదీరిన 25 ర‌కాల ఎమ్యూజ్‌మెంట్‌ రైడ్స్‌, 150కి పైగా స్టాల్స్
* 15 రోజుల పాటు సంద‌ర్శ‌కుల‌కు క‌నువిందు
సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: వేస‌విలో చ‌ల్ల‌ని సాయంత్రం వేళ న‌గ‌రవాసుల‌కు ఆహ్లాదం, ఆన‌దం క‌ల్గిస్తూ ఎగ్జిబిష‌న్ ఏర్పాటు చేయ‌డం అభినంద‌నీయ‌మ‌ని ఈ అవ‌కాశాన్ని న‌గర ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కృష్ణా ఇండ‌స్ట్రియ‌ల్ అండ్ ఎగ్జిబిష‌న్ సొసైటి కార్య‌ద‌ర్శి జి.వి.రామారావు కోరారు. న‌గ‌రంలోని స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన మణికంఠ ట్రేడ్ ఫెయిర్ స‌మ్మ‌ర్ స్పెష‌ల్ ఎగ్జిబిషన్‌ను బుధ‌వారం సాయంత్రం జి.వి.రామారావు ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బ‌న్ క‌త్తిరించి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రామారావు మాట్లాడుతూ ఎన్నో సంవ‌త్స‌రాల అనుభ‌వంతో విజ‌య‌వాడ మ‌హాన‌గ‌రంలో సంద‌ర్శ‌కుల‌ను ఆక‌ట్టుకునేలా స్వరాజ్య‌మైదానంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్‌లో అతిపెద్ద జెయింట్‌విల‌త్‌తో పాటు చిన్నారులను అలరించేందుకు కొలంబస్, కప్ అండ్ సాసర్, కమెండో, ట్రైన్, బ్రేక్ డ్యాన్స్ షో వంటివి విశేషంగా క‌నువిందు చేయ‌నున్నాయ‌ని తెలిపారు.  మణికంఠ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను నిర్వాహకులు పి.కృష్ణ, సీహెచ్ అయ్యప్ప మాట్లాడుతూ ప్ర‌ద‌ర్శ‌న‌లో భాగంగా 150కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. పెద్ద‌ల‌తో పాటు చిన్నారుల‌ను అల‌రించేందుకు 25 ర‌కాల ఎమ్మూజ్‌మెంట్స్ రైడ్స్‌ను సిద్ధం చేసిన‌ట్లు చెప్పారు. అదేవిధంగా ఫుడ్ కోర్ట్స్‌, వివిధ రాష్ట్రాల‌కు చెందిన దుస్తులు, కలంకారీ వస్తువులు, కాటన్ వస్త్రాలు, ప్లాస్టిక్ ఐటెమ్స్, క్రోకరీ ఐటెమ్స్ చేనేత త‌దిత‌ర ఉత్ప‌త్తులు ఎగ్జిబిష‌న్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో అందుబాటు ధ‌ర‌ల్లో ల‌భిస్తాయ‌ని పేర్కొన్నారు. ఎగ్జిబిష‌న్ 15 రోజుల పాటు ప్ర‌తిరోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతుంద‌న్నారు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌ను న‌గ‌ర‌వాసులు స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. ప్రారంభం తొలిరోజే ఎగ్జిబిష‌న్‌లో చిన్నారులు, సంద‌ర్శ‌కుల‌తో సంద‌డి నెల‌కొంది.

Just In...