Published On: Fri, Aug 14th, 2020

స్వర్ణ ప్యాలెస్ ఘటనలో వారందరూ ముద్దాయిలే..

* డాక్ట‌ర్ మమత

విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటన విషయమై మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కోడలు డాక్టర్ మమతకు పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో పోలీసుల ఎదుట ఆమె హాజరవ్వగా 6గంటల పాటు విచారించారు. మమత నుంచి పలు కీలక విషయాలను పోలీసులు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ నోటీసులు, విచారణ విషయమై మమత అడ్వకేట్ గంగిశెట్టి ఉమా శంకర్ మీడియాతో మాట్లాడుతూ పోలీసులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా నుంచి కోలుకుంటున్న డాక్టర్ మమతాను దాదాపు 7 గంటలు విచారించడం తగదు. పూర్తిగా కోలుకొని ఆమె ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో  పోలీస్ వారికీ అంత కన్నా పెద్ద  ప్రమాదమే. పోలీస్ శాఖకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని ఇబ్బంది పెట్టకూడదు. సంబంధం లేని వ్యక్తిని ఈ విషయంలో పదే పదే ఇబంది పెట్టడం తగదు. హాస్పిటల్, హోటల్ యాజమాన్యాలను నిందించే ముందు ఈ తప్పు జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమీషనర్,  ఫైర్ శాఖ, డీహెచ్ఎంఓల వారిది కూడా. ముందస్తు పరిస్థితులు స్థితిగతులు అధ్యయనం చేయకుండా జిల్లా కలెక్టర్, మున్సిపల్, ఫైర్, డీహెచ్ఎంఓలు ఎలా అనుమతిస్తారు?. జిల్లా స్థాయిలో అనుమతులు ఇచ్చిన వారందరు ఈ ఘటనలో ముద్దాయిలే. ఇండియాలో హైయెస్ట్ కరోనా 8డోస్‌లు 15మందికి ఇచ్చినవారిలో డాక్టర్ మమతా ఒకరు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది. త్వరలో కోవిడ్ సెంటర్‌లకు అనుమతులు ఇచ్చిన వారందరూ ముద్దాయిలు అవుతారు’ అని గంగిశెట్టి ఉమా శంకర్ చెప్పుకొచ్చారు.

Just In...