Published On: Thu, Aug 15th, 2019

స్వాతంత్ర్య వేడుకలు వారం రోజులు జరపాలి

* ఆకాంక్షించిన పవన్‌కల్యాణ్‌

సెల్ఐటి న్యూస్, గుంటూరు: దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను వారం రోజులపాటు జరుపుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారు. దేశ త్యాగధనుల చరిత్రను భావితరాలు తెలుసుకోవాలంటే కనీసం వారం రోజులు ముందు నుంచైనా ఈ వేడుకలు జరపాలని ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో గురువారం పవన్ కల్యాణ్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నేడు దేశ భ్యవిష్యత్ కోసం త్యాగాలు చేసే వారు కరవయ్యారని చెప్పారు. ఊపిరి ఉన్నంత వరకు దేశసమైక్యత కోసం ప్రతి జనసేన కార్యకర్త త్యాగాలకు సిద్ధంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.

Just In...