Published On: Wed, Mar 13th, 2019

స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే పార్టీ మారిన తోట నర్సింహం

* తెదేపా ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు 

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: అవినీతి, అక్రమాస్తుల కేసులకు సంబంధించి 12 ఛార్జిషీట్లలో ఏ-1 ముద్దాయిగా ఉన్న ప్రతిపక్ష నేత జగన్‌ ఎరకు చిక్కుకుని తోట నర్సింహం పార్టీ మారారు. అనారోగ్య కారణాలతో ఎన్నికలకు దూరంగా ఉంటానని తోట నర్సింహం చెప్పినా.. ఆయన సేవలను గుర్తించి ..ఆయన సతీమణికి ఎమ్మెల్సీ ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. కానీ చివరకు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం.. ఆయనకు బలం చేకూర్చిన పార్టీకే ద్రోహం చేశారు. టిక్కెట్‌ కోసం జగన్‌తో చేతులు కలిపారు. పౌరుల ఓటు హక్కును కాలరాస్తూ.. టిక్కెట్లను కోట్లతో తూకం వేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఏ-1 ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లేవారి నాయకత్వంలో పనిచేయడానికి నాయకులు సిగ్గుపడాలి. విషసర్పం పడగన చేరిన మీరు.. ఏదో ఒక రోజు కాటుకు గురికాక తప్పదు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజామోదం ఉన్న అభ్యర్థులకే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. అవినీతి రాజ్య స్థాపనకు కంకణం కట్టుకున్న జగన్‌ రెడ్డికి తోట నర్సింహం వంటి వారు ఇటుకలు అందించడం బాధాకరం.

Just In...