స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి…
సెల్ఐటి న్యూస్, ఇంద్రకీలాద్రి: శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి (శనివారం) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇచ్చే రోజున అమ్మవారికి ప్రసాదంగా చక్రపొంగలి, కట్టెపొంగలిని నివేదిస్తారు.