Published On: Wed, Feb 13th, 2019

స‌చివాల‌యంలో ఉచిత నేత్ర ప‌రీక్ష వైద్య శిబిరం

* ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య‌

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ఉద్యోగుల కోసం స‌చివాల‌యంలోని డిస్పెన్స‌రీలో నిర్వ‌హించిన ఉచిత నేత్ర ప‌రీక్ష వైద్య శిబిరాన్ని వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పూనం మాల‌కొండ‌య్య బుధ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగుల ఆరోగ్యం విష‌యంలో ఎంతో శ్ర‌ద్ధ వ‌హిస్తున్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేర‌కు ఇప్ప‌టికే రాష్ర్ట  వ్యాప్తంగా ముఖ్య‌మంత్రి ఇ-కంటి కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ఈ కేంద్రాల్లో ఉచితంగా కంటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి క‌ళ్ల‌ద్దాల‌ను అంద‌జేస్తున్నార‌ని అన్నారు. స‌చివాల‌యం ఉద్యోగుల‌కు కూడా ఈ సేవ‌ల్ని అందుబాటులో తీసుకొచ్చేందుకు శిబిరాన్ని ఏర్పాటు చేశామ‌ని, ఉద్యోగులంద‌రూ ఈ సేవ‌ల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. శిబిరంలో ఆటో రిఫ్రాక్టో మీట‌ర్‌, ఫండ‌స్ కెమెరా వంటి ఐ-కేర్ డివైజెస్ అందుబాటులో ఉన్నాయ‌న్నారు. స‌చివాల‌యం మ‌హిళా ఉద్యోగులు, సంబంధిత అధికారులు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.
 

Just In...