Published On: Sat, Sep 9th, 2017

స‌జావుగా దుర్గమ్మ దర్శనం అందించ‌డ‌మే ల‌క్ష్యం కావాలి

* దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం టీఎస్‌ఓ నరసింహరావు

సెల్ఐటి న్యూస్‌, ఇంద్ర‌కీలాద్రి: దసరా ఉత్సవాల్లో సామాన్య భక్తుడికి అమ్మవారి దర్శనం, ప్రసాదాలు అందించడమే దేవస్థానం సిబ్బందికి ప్రధాన లక్ష్యమని దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం టీఎస్‌ఓ నరసింహరావు అన్నారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకొని మల్లికార్జున మహామండపం రెండో అంతస్తులో ఓపీడీఎస్‌ సిబ్బంది, హోంగార్డులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో నర్సింహారావు indrakiladri_09-09-17మాట్లాడుతూ సెక్యూరిటీ సిబ్బంది, హోంగార్డులు తమకు కేటాయించిన పాయింట్‌లో ఉండటంతో పాటు భక్తులకు సరైన సమాచారం అందించి అమ్మవారి దర్శనం సాఫీగా చేసుకునేందుకు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్క భక్తుడు వీఐపీగానే భావించి వారికి జై భవానీ అని చెప్పి క్యూలైను సాఫీగా వెళ్లేందుకు కృషి చేయాలన్నారు. భక్తులను నెట్టడం, దూషించడం, దర్శనం చేసుకోకుండా లాగివేయడం వంటి చర్యలకు పాల్పడవద్దని సూచించారు. వ్యయ, ప్రయాసలకోర్చి వచ్చిన భక్తుడు మంచి దర్శనం చేసుకొని, ప్రసాదాలు తీసుకొని గమ్యస్థానాలకు చేరేంత వరకు సిబ్బందిపైన బాధ్యత ఉంటుందన్నారు. సిబ్బంది ఓర్పు, సహనంతో వ్యవహరిస్తే దేవస్థానానికి, తద్వారా అధికారులకు మంచి పేరు వస్తుందన్నారు. కార్యక్రమంలో ఓపీడీఎస్‌ జీఎం ఆంజనేయప్రసాద్‌, సెక్యూరిటీ అధికారులు రాఘవయ్య, త్రినాథ్‌ పాల్గొన్నారు.

Just In...