Published On: Thu, Nov 7th, 2019

స‌ముద్ర‌తీరంలో త్రివిద ద‌ళాల క‌స‌ర‌త్తు…

సెల్ఐటి న్యూస్‌, కాకినాడ‌: ఈ నెల 17 నుంచి 21వ తేదీ వ‌ర‌కు కాకినాడ స‌ముద్ర తీరంలో ఇండో-అమెరిక‌న్ త్రివిధ ద‌ళాల క‌స‌రత్తు నిర్వ‌హించ‌నున్నారు. కార్య‌క్ర‌మం నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి ఏర్నాట్ల‌లో భాగంగా కాకినాడ గ్రామీణం సూర్యారావుపేట స‌ముద్ర తీరం వెంబ‌డి ప‌య‌నిస్తూ నేవ‌ల్ ఎన్‌క్లేవ్ వ‌ద్ద బుధ‌వారం క‌స‌ర‌త్తు నిర్వ‌హిచిన ఆర్మీ జ‌వాన్లు. క‌స‌ర‌త్తులో యూఎస్ మెరైన్‌లు పాల్గొనే అవ‌కాశం ఉండ‌టంతో నాలుగ‌న్నర‌ కిలోమీట‌ర్ల మేర జ‌న స‌మూహం, మ‌త్య‌కారుల ప‌డ‌వ‌లు నిలుపుద‌ల చేయాల‌ని ఇప్ప‌టికే అధికారుల‌కు ఆదేశాలు జారీ చేసిన జిల్లా క‌లెక్ట‌ర్ ముర‌ళీధ‌ర్‌రెడ్డి. ప్ర‌కృతి వైప‌రీత్యాలు సంభ‌వించిన‌ప్పుడు భూమిపై నుంచి రాక‌పోక‌లు సాగించ‌లేని స‌మ‌యంలో ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్ ద‌ళాలు స‌ముద్రం వైపు వ‌చ్చి ర‌క్ష‌ణ, స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే క‌స‌ర‌త్తుల‌ను ఈ సంద‌ర్భంగా ఆర్మీ జ‌వాన్లు క‌స‌ర‌త్తులో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు.

Just In...