* క్యాలెండర్ ఆవిష్కరణలో ఉద్యోగ సంఘాల నేతలకు హామీ
* ఏపి జేఏసీ అమరావతి నేతలు బొప్పరాజు వెంకటేశ్వర్లు, వైవీ రావులు వెల్లడి
అమరావతి, సెల్ఐటి న్యూస్: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు ఏపి జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వైవీ రావులు తెలిపారు. ఏపి జేఏసీ అమరావతి 2021 కాలెండర్, డైరీలను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం

లో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బొప్పరాజు, వైవీ రావులు మాట్లాడుతూ 11వ పీఆర్సీ ఇప్పటికే చాలా ఆలస్యమైందని ఉద్యోగులు ఆందోళనలో చెందుతున్న నేపథ్యంలో చొరవ తీసుకుని పీఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలుచేయాలని సీఎంను కోరిన్టుల చెప్పారు. అలాగే ఉద్యోగులకు అంతగా ఉపయోగకరంగా లేని ఈహెచ్ఎస్ కార్డుల విషయంలో ఉద్యోగ సంఘాలతో సమీక్ష జరపాలని, ప్రభుత్వం ఆమోదించిన మెడికల్ ప్రొసీజర్స్ అన్ని నెట్ వర్క్ హాస్పిటల్స్ నందు ఈహెచ్ఎస్ పథకం క్రింద అమలయ్యేలా చూడాలని, ముఖ్యంగా కరోనా మహామ్మారి బారిన పడిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం అందించాలని, కరోనాకు బయట వైద్యం చేయించుకున్న వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కల్పించాలని సీఎం జగన్ను జేఏసీ నేతలు బొప్పరాజు, వైవీ రావులు కోరారు. ఈ సందర్భంగా పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఏపి జేఏసీ అమరావతి నాయకులతో చర్చించి సాధ్యమైనంత త్వరలో పరిష్కారించాలని సీఎం అదనపు కార్యదర్శి ధనుంజయరెడ్డిని ఆదేశించారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ జేఏసీ నేతలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా ఏపి జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు, ప్రధాన సెక్రటరీ వైవి రావులు కృతజ్ఞతలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణలో కో ఛైర్మన్స్ జి.వి.నారాయణరెడ్డి, ఐ.విజయకుమార్, జి.కేశవనాయుడు, జనకుల శ్రీనివాసరావు, కె.సంగీతరావు, మహిళా విభాగం కార్యదర్శి మెహరాజ్ సుల్తానా పాల్గొన్నారు.
