Published On: Sun, Apr 21st, 2019

స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నం భార‌త‌దేశం సొంతం..

* ఆప్గనిస్థాన్ దేశీయవాది హజ్రత్ సయ్యద్ ఖ్వాజా జరీఫ్ మౌదూద్  చిప్తి బాబా

* 12వ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా కొండపల్లి షాబుకారి మసీదు సందర్శ‌న‌

సెల్ఐటి న్యూస్‌, కొండ‌ప‌ల్లి: హిందూ, ముస్లీం, క్రైస్త‌వులు ఎటువంటి బేష‌జాలు లేకుండా క‌లిసిమెల‌సి ఉండ‌టం, స‌ర్వ‌మ‌త స‌మ్మేళ‌నాన్ని చాట‌డం భార‌త‌దేశంలో మాత్ర‌మే క‌న‌పిస్తుంద‌ని, ఈ విధానం ప్ర‌పంచ దేశాల‌కు ఆద‌ర్శ‌నీయ‌మ‌ని, ముఖ్యంగా భ‌విష్య‌త్ త‌రాల‌కు ఇది శుభ‌ప‌రిణామ‌మ‌ని మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త వంశీకులు, ఆప్గనిస్థాన్ దేశీయవాది హజ్రత్ సయ్యద్ ఖ్వాజా జరీఫ్ మౌదూద్  చిప్తి బాబా అన్నారు. 12వ వార్షికోత్సవం సంద‌ర్శంగా శ‌నివారం రాత్రి ఆయ‌న కొండపల్లిలోని  450 సంవ‌త్స‌రాల చ‌రిత్ర క‌ల్గిన షాబుకారి మసీదును సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు షాబుకారి మ‌సీదు క‌మిటీ ఛైర్మ‌న్ అల్తాఫ్ అలీ రజా ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం మ‌సీదులో ప్ర‌త్యేక ప్రార్థ‌న‌లు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆప్గనిస్థాన్ దేశీయవాది హజ్రత్ సయ్యద్ ఖ్వాజా జరీఫ్ మౌదూద్  చిప్తి బాబా మాట్లాడుతూ కొండపల్లి షాబుకారి మసీదును సందర్శిచటం గొప్ప అనుభూతినిచ్చింద‌న్నారు. ఎక్క‌డా లేని విధంగా కేవ‌లం భారతదేశంలో మాత్ర‌మే కులమతాలకు అతీతంగా మతసామరస్యం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇక్కడ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఐక్యతగా ఉంటార‌ని ప్ర‌శంసించారు. ఇస్లాం సందేశం ప్రేమను చాటడమేన‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త‌దేశంలో ద‌ర్గాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని ఇస్లాం బాట‌లో న‌డిచేవారు ఉగ్ర‌వాదానికి, హింస‌కు దూరంగా ఉంటార‌ని తెలిపారు. కొండపల్లి షాబుకారి మ‌సీదు బాబా అల్తాఫ్ అలీ రజా మాట్లాడుతూ ఆప్గనిస్థాన్ నుంచి హజ్రత్ సయ్యద్ ఖ్వాజా జరీఫ్ మౌదూద్  చిప్తి బాబా ఇక్క‌డ‌కు రావడం శుభపరిణామం అన్నారు. కొండ‌ప‌ల్లి షాబుఖారి మసీదుకు ఏంతో చ‌రిత్ర‌, ప్రాముఖ్య‌త ఉంద‌న్నారు. శ‌తాబ్ధాల చ‌రిత్ర క‌ల్గిన షాబుకారి ద‌ర్గాను 12 ఏళ్ల క్రితం పున‌ర్నించ‌డంతో పాటు ఇక్కడ మసీదులో ప్రార్ధనలు జరిపించాం అని గుర్తుచేశారు. నాటి నుంచి నేటివ‌ర‌కు ఇక్క‌డ అనేక ప్రార్థ‌న‌లు, సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు చెప్పారు. దేశవిదేశాల నుండి ఎంతోమంది ముస్లీం సోద‌రుల‌తో పాటు హిందువులు, క్రైస్త‌వులు సైతం కొండ‌ప‌ల్లి షాబుకారి మ‌సీదును సంద‌ర్శిస్తున్నార‌ని తెలిపారు.

Just In...