Published On: Wed, Sep 18th, 2019

హత్య కేసును చేదించిన నాయుడుపేట పోలీసులు

* జిమ్ చేసే ఎలాస్టిక్ రబ్బరు వైరు భార్య మెడకు బిగించి హత్య

* ఆపై ఫ్యాన్‌కు వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరణ

సెల్ఐటి న్యూస్‌, చిత్తూరు క్రైం: చిత్తూరు జిల్లా, కార్వేటి నగరం మండలం, అన్నూరు గ్రామానికి చెందిన దువ్వూరు రఘురామిరెడ్డి కుమార్తె మృతురాలైన గోమతికి మరియు తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లా, పొన్నేరి తాలుకా, అవిరివాక గ్రామంనకు చెందిన భక్తవత్సల రెడ్డి పెద్ద కొడుకు సన్నారెడ్డి ధీరజ్‌కుమార్ రెడ్డితో పెద్దల నిశ్చియించిన వివాహం జరిగింది. వారికి ఒక సంవత్సరం వయుస్సు గల హరియక్ష్ పేరు గల కొడుకు సంతానం. సదరు సన్నారెడ్డి ధీరజ్ కుమార్ నాయుడుపేట మండలంలోని మేనకూరు గ్రామ సెజ్‌లో వున్న అరబిందో కంపెనీలో సుమారు 4 ఏళ్ల నుండి ఉద్యగం చేస్తున్నాడు. సుమారు మూడు సంవత్సరముల నుండి నాయుడుపేట టౌన్‌లో విజయగణపతి దేవాలయం వెనుక ఉన్న అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో దక్షిణం వైపు గల పోర్షన్ లో బాడుగకు కాపురం ఉంటున్నారు. వారి అన్యోన్య జీవితంలో ముద్దాయికి అతని భార్య గోమతి ప్రవర్తనఫై అనుమానం కారణంతో వారి మద్య అనేక సార్లు మనస్పర్దలు వచ్చినవి. గోమతి తల్లిదండ్రులు సర్ది చెప్పేవారు.. సదరు గోమతి ఫై వున్నా అనుమానంతో ఈ నెల 15న ఉదయం సుమారు 10.30 గంటల సమయంలో గోమతితో గొడవ పెట్టుకొని, ఆమెను చంపాలనే ఉద్దేశంతో ఆమె మెడకు జిమ్ చేసే చెస్ట్ ఎలాస్టిక్ రబ్బరు వైరు బిగించి బలంగా లాగీ గోమతిని చంపాడు. తరువాత దానిని ఆత్మహత్య గా అందరిని నమ్మించడానికి వాళ్ళ ఇంటిలోని జిమ్ రూంలో ఫ్యాన్‌కు వుండే ఒక రెక్కకు చీరను వ్రేలాడదీసినాడు. అంతట చుట్టూ ప్రక్కల వారిని నమ్మించి మృతురాలు గోమతికి చికిత్స చేయలాని, నాయుడుపేటలోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొని పోగా, అక్కడ డాక్టర్ గోమతిని పరిక్షించి ఆమె చనిపోయినట్లుగా నిర్దారించినారు. అనంత‌రం ముద్దాయి ధీరజ్‌కుమార్ ఒక ప్రైవేటు అంబులెన్స్ లో తన భార్య శవాన్ని వారి స్వగ్రామం అయిన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్ళూరు జిల్లా, పొన్నేరి తాలుకా, అవిరివాక గ్రామంనకు తీసుకెళ్ళి ఎవరికి అనుమానం రాకుండా దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతట మృతురాలి తల్లి దండ్రులకు గోమతి హత్య‌ఫై వచ్చిన అనుమానంతో పోలీసుల సలహా మేరకు తిరిగి శవాన్ని నాయుడుపేట ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచి మృతురాలు గోమతి తండ్రి దువ్వూరు రఘురామిరెడ్డి రిపోర్ట్ ఫై నాయుడుపేట పోలీసు స్టేషన్‌లో మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడమైనది. సదరు దర్యాప్తులో భాగంగా బుధ‌వారం మధ్యాహ్నం సుమారు 2.30 గంటలకు నాయుడుపేట సీఐ జి.వేణుగోపాల రెడ్డి, ఎస్‌.ఐ.డి.వెంకటేశ్వర్లు, సిబ్బందితో క‌లిసి ముద్దాయిని నాయుడుపేటలోని శ్రీకాళహస్తి బైపాస్ వద్ద గల గోమతి సెంటర్ నందు అరెస్టు చేశారు.

Just In...