Published On: Wed, Jan 4th, 2017

హాస్యబ్రహ్మ శంకరనారాయణ సేవలు ప్రశంసనీయం

* ఏపీ శాస‌న‌స‌భ ఉప స‌భాప‌తి మండ‌లి బుద్ధ‌ప్ర‌సాద్‌

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: తెలుగు భాష ఔన్నత్యాన్ని హాస్య రచనల ద్వారా కాపాడుతున్న హాస్య బ్రహ్మ శంకరనారాయణ ప్రశంసనీయులని రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌ అన్నారు. స్వరాజ్య మైదానంలోని 28వ పుస్తక మహోత్సవాల్లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ వేదికపై జ‌న‌వ‌రి 3న (మంళవారం) రాత్రి హాస్య బ్రహ్మ శంకరనారాయణ రచించిన ‘ఇంగ్లీషుకు తల్లి తెలుగు సరస్వతీపుత్రులు’ అనే పుస్తకాన్ని ఉపసభాపతి బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు. ఎస్‌ఆర్‌ బుక్‌ లింక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ సమాజ సమస్యలను స్పృశిస్తూ సమాజ ఇతి వృత్తాలే నేపథ్యాలుగా సాగే రచనలకు ఎన్నటికీ తరగని ఆదరణ ఉంటుందని పేర్కొన్నారు. శంకరనారాయణ రాసిన ‘ఇంగ్లీషుకు తల్లి తెలుగు పుస్తకం’ తెలుగుభాషలోని సౌందర్యం, సుకుమార్యం, వినూత్న పదబంధాలతో పుస్తకాన్ని రాయడం అభినందనీయమని అన్నారు. తన హాస్య సంభాషణలతో పాఠకుడ్ని తల తిప్పకుండా చదివించగల రచయిత శంకరనారాయణ అన్నారు. ఆయన సేవలు అభినందనీయం అని అన్నారు. ఇదే వేదికపై హైదారాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్యుడు డివికె వాసుదేవన్‌ రాసిన జీవన విద్య అనే పుస్తకాన్ని సీనియర్‌ పాత్రికేయులు సి.రాఘవాచారి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లారచయిత సంఘం ప్రధాన కార్యదర్శి జీవీ పూర్ణచంద్, రాఘవేంద్ర పబ్లిషర్స్ అధినేత దిట్టకవి రాఘవేంద్రరావు, సాహీతీవేత్త డాక్టరు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

hasya_brahmma_2 hasya_brahmma_1

Just In...