Published On: Fri, Sep 18th, 2020

హిందూ దేవాలయాలకు, ఆస్తులకు రక్షణ కరువైంది

* బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వై.వి.సుబ్బారావు

అమరావతి, సెల్ఐటి న్యూస్‌: అంతర్వేది ఆలయం రధం దగ్ధం సంఘటన నేపథ్యంలో హిందువులపైన, బీజేపీ నాయకులపైన అక్రమంగా బనాయించిన కేసులను బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని, వరుసగా హిందూ దేవాలయాల‌పై జరుగుతున్న దాడుల పై సమగ్ర విచారణ జరిపించాలని చలో అమలాపురం ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపు‌ మేరకు అమలాపురం బయల్దేరిన బిజెపి నాయకులను కార్యకర్తలను అరెస్టు చేయటం అత్యంత దుర్మార్గపు చర్య అని బిజెపి రాష్ట్ర రైతు నాయకులు వై వి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో ఇలాంటి దుర్ఘటనలు, సంఘటనలు చోరీలు జరుగుతున్నాయని, ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరితో ఉందని, ఇప్పటికైనా ఈ ఉదాసీన వైఖరినీ ప్రక్కన పెట్టి దుండగులను ఒక్కరినైనా అరెస్టు చేశారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. నేరం చేసిన దుండగులను, నేరస్థులను పక్కనపెట్టి, హిందువులను బిజెపి నాయకులు, కార్యకర్తలను అన్యాయంగా అరెస్టు చేయడం
దారుణమన్నారు. సుమారు 37 మందిని ఈ సందర్భంగా అరెస్టు చేయడం జరిగిందని, ఇప్పటికైనా ప్రభుత్వంవీరిపై బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా కేసులు లేకుండా వదిలి పెట్టాలన్నారు. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉన్నదని తెలియజేశారు హిందూ దేవాలయాలకు దేవాలయ ఆస్తులకు హిందు సోదర సోదరీమణులకు రక్షణ కరువైందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు ఒకపక్క దేవాలయ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, ఈ భూములు అన్యమతస్తుల చేతుల్లోకి వెళ్తున్నాయని, ఈ స్థలాలలో చర్చిలు మసీదులు ఇలా ఒకటేమిటి దారుణమైన ఎన్నో పనులు జరుగుతున్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా హిందూ దేవాలయాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దేవాదాయ శాఖ నుండి పూర్తిగా తప్పించి వీటి పర్యవేక్షణ బాధ్యతలను ఆయా మత పీఠాధిపతులకు, పెద్దలకు అప్ప చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ డిమాండ్ చేశారు. హిందూ భక్తుల కానుకలతో వారు కట్టే పన్నులతో వచ్చే ఆదాయాన్ని అన్యమత ప్రచారం కొరకు అన్ని మత అభివృద్ధి కొరకు ఉపయోగిస్తున్నారని, ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అలానే హిందూ దేవాలయాలలో పని చేస్తున్నటువంటి అన్యమత మతస్తులను ఉద్యోగం నుండి పూర్తిగా తొలగించి హిందూ దేవాలయాలలో హిందువులు మాత్రమే పని చేసే విధంగా చట్టాన్ని తీసుకురావాలని వైవి సుబ్బారావు ప్రభుత్వాన్ని కోరారు.

Just In...