Published On: Mon, Aug 14th, 2017

హెచ్.ముత్యాలంపాడు చెరువుకు గోదావరి జలాలు

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: కృష్ణా, మైలవరం నియోజకవర్గం, జి.కొండూరు మండల పరిధిలోని హెచ్.ముత్యాలంపాడు ఊరచెరువుకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను మళ్లించారు. స్థానిక టీడీపీ నేతలు ఆదివారం సాగునీటిని విడుదల చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణానదికి మళ్లిస్తున్న గోదావరి నీళ్లు బుడమేరుపై వెలగలేరు వద్ద ఉన్న చెక్ డ్యామ్ వద్దకు రివర్స్ వచ్చాయి. అందుబాటులో ఉన్న బ్యాక్ వాటర్ ను గాలి ట్యూబుల ద్వారా వెనుకకు తెచ్చి హెచ్.ముత్యాలంపాడు వంతెన వద్దకు మళ్లించారు. అక్కడినుండి మోటర్ల సాయంతో ఎత్తిపోస్తూ గ్రామంలోని ఊరచెరువుకు మళ్లిస్తున్నారు. మంత్రి ఉమ గారి కృషి కారణంగా వెంటనే మోటార్లు అమర్చారని, మోటర్లకు కావాల్సిన విద్యుత్ కోసం తక్షణమే ట్రాన్స్ ఫార్మర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చారని టీడీపీ నేతలు తెలిపారు. మంత్రి ఉమా గారికి రైతుల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఊరచెరువు కింద దక్షిణపొలం, ఉత్తరపొలం కలిపి 200 ఎకరాల వరకు సాగవుతోంది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న సాగునీరు మంత్రి ఉమ గారి వల్ల ఇన్నాళ్లకు వచ్చాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆనందానికి అవధులు లేవు. టీడీపీ మండల శాఖ అధ్యక్షులు ఉయ్యూరు నరసింహారావు, సీనియర్ నేత చల్లా ప్రభాకరరావు, సరిపల్లి నాగమల్లేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.

godavari_water_for_h_mutyalampadu_1

Just In...