Published On: Fri, May 29th, 2020

‘హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిల్‌ వేస్తాం’

* మంత్రి ఆదిమూల‌పు సురేష్‌

వైఎస్సార్‌ కడప జిల్లా, సెల్ఐటి న్యూస్‌: ఏడాది పాలనలో ముఖ్యమంత్రి వైఎస్ జ‌గన్మోహ‌న్ రెడ్డి దేశంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. వైఎస్సార్‌ జిల్లాలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ ‘సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్ష పార్టీలు చూసి ఓర్వలేక పోతున్నార‌ని, హైకోర్టు ఇచ్చిన తీర్పుపైనా రాజకీయాలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నార‌ని తెలిపారు. సంస్కరణలో భాగంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నార‌ని చెప్పారు. కుల, మ‌తాలకు, పార్టీలకు అతీతంగా పని చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జ‌గ‌న్ ఆదేశించార‌ని తెలిపారు. ఏదో విధంగా ప్రభుత్వంపై బురద జల్లేందుకే ప్రతిపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. పరిపాలనలో పారదర్శకత, ఆలోచన విధానంలో కీలక నిర్ణయాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన విధానాన్ని హైకోర్టు ఆలోచించలేద‌ని వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో పిల్ వేస్తాం అని మంత్రి సురేష్ వెల్ల‌డించారు.

Just In...