Published On: Thu, Nov 19th, 2020

హైదరాబాద్‌లో భారీగా హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్, సెల్ఐటి న్యూస్‌: వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రెండు వేరు వేరు హవాలా కేసుల్లో 34 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. సుల్తాన్ బజార్‌లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.21 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి రూ. 13 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు.

Just In...