Published On: Sun, Jul 12th, 2020

హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి కిట్ల పంపిణీ

* కిట్‌లో మందులు, శానిటైజర్, ఆక్సీమీటర్, మాస్కులు
* కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలింపు
అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్నవారు బయటకు రాకుండా… వారికి కావాల్సిన వాటిని వారి ఇంటికే పంపించే కార్యక్రమాన్ని చేపట్టింది. కరోనా హోమ్ క్వారంటైన్ కిట్‌ను పంపించనుంది. ఈ కిట్‌లో కరోనా మందులు, శానిటైజర్, మాస్క్‌లు, గ్లౌజ్‌లు, ఆక్సీమీటర్ ఉంటాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉండి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఈ కిట్‌ను అందిస్తారు. లక్షణాలు ఎక్కువగా ఉన్న వారిని హాస్పటల్‌కు తరలించి చికిత్స అందిస్తారు. హోం క్వారంటైన్‌లో ఉన్నవారు మెడిసిన్స్, ఇతర సామగ్రి కోసం బయటకు వస్తే… ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన వాటిని కిట్ ద్వారా అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేప‌ట్టింది.

Just In...