Published On: Tue, Oct 1st, 2019

హోటల్ డి.వి. మానర్‌కు బెస్ట్ కేటగిరి అవార్డు..

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ‌: విజ‌య‌వాడ మ‌హాత్మాగాంధీ రోడ్డులో ఉన్న హోటల్ డి.వి. మానర్‌కు అత్యుత్తమ 4స్టార్ బెస్ట్ కేటగిరీ అవార్డు సాధించినట్లు హోటల్ మేనేజింగ్ పార్టనర్ నాగేంద్రప్రసాద్ ధనేకుల, జనరల్ మేనేజర్ రాజేష్ బెర్రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా హోట‌ల్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారిరువురూ మాట్లాడుతూ భారత ప్రభుత్వం – పర్యాటక శాఖ వారిచే జాతీయస్థాయిలో నేషనల్ టూరిజం అవార్డును ప్రతి సంవత్సరం అందిస్తుందన్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 27న న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ టూరిజం – 2019 వేడుకలలో హోటల్‌కు అవార్డు వచ్చిందని తెలిపారు. అవార్డును కేంద్ర టూరిజం మ‌రియు సాంస్క్ర‌తిక శాఖా మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం సెక్రటరీ జనరల్ జూరబ్ పోలోలికాషివి ప్రధానం చేశారని తెలిపారు. 2017-18 సంవత్సరానికి గాను తమ హోటల్ 4 స్టార్ బెస్ట్ కేటగిరీ అవార్డు లభించిందని తెలిపారు. 2014 -15 సంవత్సరానికి అంతర్జాతీయ టూరిజం అవార్డును క్వాలిటీ హోటల్ డివి మానర్‌కు ప్రధానం చేసిందన్నారు. చక్కటి రుచికరమైన, శుచికరమైన వంటకాలను అందించడంలో తమ హోటల్ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులు హోటల్ యాజమాన్యాన్ని అభినందించారు.

Just In...