హోటల్ ఫార్చ్యూన్లో క్రిస్మస్ కేకు సిద్ధం..
సెల్ఐటి న్యూస్, విజయవాడ: క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకొని విజయవాడ మహాత్మాగాంధీ రోడ్డులో ఉన్న హోటల్ ఫార్చ్యూన్ మురళీలో క్రిస్మస్ కేకు మిక్సింగ్ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రిస్మస్ కేకు మిక్సింగ్‌ను తయారుచేశారు. డ్రైఫ్రూట్స్, వివిధ రకాల వైన్లు మిక్స్ చేసి క్రిస్మస్ కేకును తయారుచేశారు. ఈ సందర్భంగా హోటల్ డిప్యూటీ సేల్స్ మేనేజర్ ఆర్.పవన్‌కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటా క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భాలను పురస్కరించుకొని క్రిస్మస్ కేకును తయారు చేయడంతో పాటు న్యూ ఇయర్ రోజున హోటల్లో జరిగే వేడుకలో భోజన ప్రియులకు క్రిస్మస్ కేకును వడ్డించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా న్యూ ఇయర్ వేడుకలు అత్యంత ఉత్సాహవంతంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కార్యక్రమంలో సేల్స్ మేనేజర్ షేక్ జిలానీ, పలువురు చెఫ్‌లు పాల్గొన్నారు.