Published On: Tue, Jun 18th, 2019

హోదాపై చంద్ర‌బాబు స‌ల‌హాలు మాకొద్దు..

* అమ‌రావ‌తి నిర్మాణం ఓ పెద్ద కుంభ‌కోణం

* మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: నవ్యాంధ్రప్ర‌దేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణం ఓ పెద్ద కుంభకోణమని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిలో ఎలాంటి అక్రమాలు జరిగాయో విచారణలో తేలుతుందన్నారు. ఈ వ్యవహారంపై తాము మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తంచేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో తెదేపా అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు సలహాలు తమకు అవసరం లేదని బొత్స వ్యాఖ్యానించారు.

Just In...