Published On: Fri, Sep 13th, 2019

హ్యాపీ రిసార్ట్స్ వద్ద ప్రమాదం… ఇద్దరు మృతి

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి క్రైం: గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు మండలం హ్యాపీ రిసార్ట్స్ వద్ద శుక్ర‌వారం తెల్ల‌వారుజామున రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. రోడ్ సైడ్ మార్జిన్లో ఆగివున్న కంటైనర్‌ను సుమారు 4గంటలకు నిద్ర‌మత్తులో శ్రీకాకుళం నుంచి గుంటూరు గొర్రెల  మండీకి వెళ్తున్న అశోక్ లైలాండ్ ap 39v 9572 గూడ్స్ వెహికల్  రోడ్ సైడ్  మార్జిన్లో  ఆగివున్న  కంటైనర్‌ను ఢీ కొట్టింది. డ్రైవర్  కోటిపల్లి  శాంతరావు అక్క‌డిక‌క్క‌డే చనిపోయాడు. వాహ‌నంలో మొత్తం ఐదుగురు ప్రయాణిస్తున్నారు.  వారిలో ఒకరు చనిపోయారు మిగిలిన నలుగురుని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Just In...