Published On: Tue, May 21st, 2019

హ‌జ్ యాత్ర ఖ‌ర్చుల‌పై స్ప‌ష్ట‌త‌

* హైద‌రాబాద్ నుంచి వెళితే రూ.2,77,750

* బెంగుళూరు నుంచి వెళితే రూ.2,90,150

* ఖుర్బానీకి అద‌నంగా రూ.9,150

సెల్ఐటి న్యూస్‌, ఆధ్యాత్మికం: 2019 హ‌జ్ యాత్ర కోసం యాత్రికులు చెల్లించాల్సిన డ‌బ్బుల‌పై స్ప‌ష్ట‌త వ‌చ్చింది. హైద‌రాబాద్ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన 1430 మంది వెళ్తున్నారు. వీరిలో నాన్ కూకింగ్ నాన్ ట్రాన్స్ పోర్ట్ జోన్ (ఎన్‌సిఎన్‌టిజ‌డ్‌)లో వ‌స‌తి కోసం 325 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరు ఒక్కొక్క‌రు  రూ.2,77,750 చెల్లించాలి. ఖుర్బానీ కోసం అద‌నంగా మ‌రో రూ.9,150 చెల్లించాలి. అజీజియాలో వ‌స‌తి కోసం 1105 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరు ఒక్కొక్క‌రు రూ.2,40,700 చెల్లించాలి. ఖుర్బానీ కోసం అద‌నంగా మ‌రో రూ.9,150 చెల్లించాలి. బెంగ‌ళూరు నుంచి ఏపీకి చెందిన 447 మంది వెళ్తున్నారు. వీరిలో  నాన్ కూకింగ్ నాన్ ట్రాన్స్ పోర్ట్ జోన్ (ఎన్‌సిఎన్‌టిజ‌డ్‌)లో వ‌స‌తి కోసం 62 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరు ఒక్కొక్క‌రు రూ.2,90,150 చెల్లించాలి. ఖుర్బానీ కోసం అద‌నంగా మ‌రో రూ.9,150 చెల్లించాలి. అజీజియాలో వ‌స‌తి కోసం 395 మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వీరు ఒక్కొక్క‌రు రూ.2,53,100 చెల్లించాలి. ఖుర్బానీ కోసం అద‌నంగా మ‌రో రూ.9,150 చెల్లించాలి. ఇప్ప‌టికే హ‌జ్ యాత్రికులు రెండు విడ‌త‌లుగా హ‌జ్ క‌మిటీ ఆఫ్ ఇండియాకు డ‌బ్బులు చెల్లించి వున్నారు. మొత్తం ఎంత చెల్లించాల‌న్న అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చింది కాబ‌ట్టి మిగిలిన డ‌బ్బుల్ని జులై 4వ తేదీ లోపు చెల్లించాల‌ని హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ మక్సూద్ అహ్మద్‌ఖాన్ స‌ర్క్యూల‌ర్ విడుద‌ల చేశార‌ని ఎపి స్టేట్ హజ్ కమిటీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.ఎం.డి.తాజుద్దీన్ ఆరీఫ్ ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. నాన్ కూకింగ్ నాన్ ట్రాన్స్ పోర్ట్ జోన్ (ఎన్‌సిఎన్‌టిజ‌డ్‌)లో వ‌స‌తికి సంబంధించి డ్రా నిర్వ‌హించి ఫైన‌ల్ చేశారు. మిగిలిన 11,929 మంది వ‌స‌తిని అజీజియాకు మ‌ర్చారు. మెహ‌రం కోటా కింద దేశ‌వ్యాప్తంగా 890 మంది మ‌హిళ‌లు హ‌జ్ యాత్ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోగా 500 మందిని డ్రా ద్వారా సెలెక్ట్ చేశారు. ఎపి కి చెందిన 11 మంది మ‌హిళ‌ల‌కు ఈ మెహ‌రం కోటా కింద హ‌జ్ చేసుకునే అవ‌కాశం ల‌భించింద‌ని ఎపి స్టేట్ హజ్ కమిటీకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్.ఎం.డి.తాజుద్దీన్ ఆరీఫ్ తెలిపారు.

Just In...