Published On: Fri, Jun 7th, 2019

10న ఏపీ మంత్రి మండలి సమావేశం

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి మొట్టమొదటి సమావేశం ఈ నెల 10వ తేదీన (సోమవారం) జరగనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం ఉదయం 10.30 నిమిషాల నుంచి సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో ఉన్న కేబినెట్ మీటింగ్  హాల్‌లో మంత్రి మండలి సమావేశం జరగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Just In...