Published On: Thu, Apr 1st, 2021

అభివృద్ధి చేసిన పాఠ‌శాల‌లు ప్రజ‌ల‌కు అంకితం..

* ప్రభుత్వ పాఠశాలల్లో నాడు-నేడుపై స‌మీక్ష‌లో సీఎం జగన్ ప్ర‌క‌ట‌న
అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: తొలిదశలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తామ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. మనబడి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా రెండో దశలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యా సంస్థల అభివృద్ధి కమిటీలు, అధికారులకు శిక్షణా కరదీపికను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ ‌రెడ్డి ఆవిష్కరించారు. జగనన్న గోరుముద్దలో మధ్యాహ్న భోజనం తయారీ, నాణ్యమైన ఆహారం తయారీపై ఎస్‌ఓపీలతో రూపొందించిన పుస్తకాన్ని, టాయిలెట్ల మెయింటెనెన్స్‌పై ఎస్‌ఓపీతో కూడిన పుస్తకాల‌ను సీఎం జ‌గ‌న్ ఆవిష్కరించారు. రెండోదశ కింద చేపట్టాల్సిన నాడు- నేడు పనులు, హాస్టళ్లలో నాడు– నేడు కింద చేపట్టనున్నపనులు, టాయిలెట్‌ మెయింటెనెన్స్‌పై సీఎం సమీక్ష నిర్వ‌హించారు. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌.. జవహర్‌ నవోదయ, కేంద్రీయ విద్యాలయ స్కూల్స్‌లో ఉన్న మౌలిక సదుపాయాలు, నాడు నేడు కింద ప్రభుత్వం చేపట్టిన మౌలిక సదుపాయాల్లో తేడా వివరించిన అధికారులు. మొదటిదశలో నాడు -నేడు కింద పనులు పూరై్తన పాఠశాలల్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో పరిశీలన చేయించాలి. వారికి సులువుగా అర్థమయ్యేలా పూర్తిచేసిన నాడు – నేడు పనుల పరిశీలనపై ప్రశ్నావళి పంపండి. నాడు- నేడు కింద పెద్ద ఎత్తున పనులు చేశాం, ఇప్పుడు స్కూళ్లను సరిగ్గా నిర్వహించడంపై దృష్టిపెట్టాలి. నిర్వహణ సరిగ్గా లేకపోతే.. ఉపయోగం ఉండదు. ఏప్రిల్‌ 30న తొలిదశలో అభివృద్ధిచేసిన పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తాం. అధికారులు ఎవ్వరైనా పాఠశాలలకు వెళ్లినప్పుడు తప్పనిసరిగా నిర్వహణ ఎలా ఉందన్న దానిపై కచ్చితంగా దృష్టిపెట్టాలి. టాయిలెట్ల నిర్వహణ బాగుందా? లేదా? అన్న విషయాన్ని తప్పనిసరిగా చూడాల‌న్నారు.

జగనన్న గోరుముద్ద…
జగనన్న గోరుముద్దపై వచ్చిన ఫిర్యాదులు వెంటనే పరిష్కరించాలి, తిరిగి పునరావృతం కాకూడదు. ఎక్కడ తిన్నా కూడా రుచి ఒకేలా ఉండాలి, అంతేకానీ మారకూడదు. గోరుముద్ద కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలి. నాణ్యతతో ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలి. ఎక్కడచూసినా ఆహార పదార్థాల నాణ్యత ఒకేలా ఉండాలి. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌.. ఆహార పదార్థాలను తయారు చేయడంపై ఎస్‌ఓపీని అందుబాటులోకి తీసుకుకావాలి. గోరుముద్ద, టాయిలెట్ల నిర్వహణపై ప్రతిరోజూకూడా స్కూళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్‌ కచ్చితంగా రావాలి. ఎక్కడ ఏ సమస్యవచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. చిన్న రిపేరు వచ్చినా వెంటనే దాన్ని సరిదిద్దాలి. సమస్య తెలిసిన దగ్గరనుంచీ ఆ పని పూర్తయ్యేంతవరకూ కూడా ఎలా చేయాలన్నదానిపై ఒక ఎస్‌ఓపీ ఉండాలి. అధికారులకు దీనికి సంబంధించి అలర్ట్స్‌ రావాలి.

జగనన్న విద్యాకానుక…
జగనన్న విద్యాకానుకపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. మళ్లీ స్కూళ్లు ప్రారంభమయ్యేనాటికి కచ్చితంగా పిల్లలకు విద్యాకానుక అందాలి. ఇందులో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదు. విద్యాకానక కింద అందించనున్న డిక్షనరీ, పాఠ్యపుస్తకాలు, నోటు ‌పుస్తకాలు, బ్యాగులను పరిశీలించిన సీఎం. విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు విప్లవాత్మక మార్పులకు దారితీస్తాయి. ప్రతి ఒక్కరూ కూడా నైపుణ్యాన్ని, సమర్థతను పెంచుకుంటారు.  తద్వారా ఉద్యోగ అవకాశాలు, జీతాలు పెరిగి జీవన ప్రమాణాలు మారుతాయి. అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌..

సీబీఎస్‌ఈ విధానం…
విద్యారంగంలో విప్లవాత్మక మార్పుగా ప్రభుత్వం తీసుకొస్తున్న సీబీఎస్‌ఈ విధానంపై సీఎం సమీక్ష. సీబీఎస్‌ఈ విధానంలోని అంశాలను సీఎంకు వివరించిన అధికారులు. ఏపీలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని సీబీఎస్‌ఈ తెరవనుందని సీఎంకు తెలిపిన అధికారులు. 2021–22 సంవత్సరంలో అన్ని ప్రభుత్వ స్కూళ్ళకూ సీబీఎస్‌ఈ అఫిలియేషన్ 2024–25లో సీబీఎస్‌ఈ టెన్త్‌బోర్డు పరీక్షలు రాయనున్న రాష్ట్ర విద్యార్థులు. సీబీఎస్‌ఈపై టీచర్లకు అవగాహణ, శిక్షణ కల్పించండి. విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లు ఉండాలని స్పష్టంచేసిన సీఎం.  దార్శనికతతో విద్యారంగంలో ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు చేపట్టింది. ఏ నిర్ణయ‌మైనా మంచి విద్య అందరికీ అందాలి, పేదపిల్లలు గొప్పగా చదువుకోవాలన్న సదుద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ అమలు చేస్తున్నాం.

ఇన్‌స్పెక్షన్, మానిటరింగ్‌లు పటిష్టంగా ఉండాలి…
దీనికోసం ఏంచేయాలన్నదానిపై కార్యాచరణ రూపొందించాలి. అధికారులు కూర్చొని ప్రస్తుతం ఉన్న సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవాలి. ఎడ్యుకేషన్‌మానిటరింగ్‌ కమిషన్‌ బలోపేతంగా పనిచేయాలి. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు.. ఇంగ్లిషులో, తెలుగులో ఇస్తున్నాం. ఇంగ్లిషులో బోధించడం, ఇంగ్లిషులో మాట్లాడడం అలవాటు చేయాలి. ప్రారంభంలో తడబాట్లు, తప్పులు ఉంటాయి. కాని ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్తే…. తప్పకుండా మెరుగుపడుతుంది. ఈ అంశాలను టీచర్లకు అర్థమయ్యేలా చేరవేసి వారిలో స్ఫూర్తిని నింపండి. పీపీ–1లో అంగన్‌వాడీల్లో కూడా ఇంగ్లిషు మాధ్యమాన్ని పెడుతున్నాం అన్నారు. స‌‌మీక్ష‌లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

   

Just In...