Published On: Sun, Apr 4th, 2021

జడ్‌పిటిసి, యంపిటిసి ఎన్నికలకు సర్వం సిద్ధం..

* మొత్తం ఓటర్లు 20,04,417 మంది

* జిల్లాలో 41 జడ్.పి.టి.సి., 648 యం.పి.టి.సి. స్థానాలకు ఎన్నికలు

* కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ వెల్ల‌డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: జిల్లాలో జడ్‌పిటిసి, యంపిటిసి స్థానాలకు జరిగే ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్‌ ఏ.యండి. ఇంతియాజ్ తెలిపారు. శ‌నివారం ఉద‌యం విజ‌య‌వాడ‌లోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జాయింట్ కలెక్టరు (రెవెన్యూ) డా. కె.మాధవీలత, జెసి (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, జడ్‌పి సిఇఓ పి.సూర్యప్రకాష్‌లతో కలిసి కలెక్టర్ ఇంతియాజ్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ జిల్లాలో జడ్ పిటిసి , యంపిటిసి స్థానాలకు ఈనెల 8 గురువారం ఉ . 7 గంటల నుండి సా . 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ ఉంటుందన్నారు . ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని , ఇటీవల జరిగిన గ్రామస్థాయి , మున్సిపల్ స్థాయి ఓటింగ్ ప్రక్రియలో ఓటర్లు 80 శాతంకు పైగా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారన్నారు . అదే చైతన్యం ఇప్పుడు జరగబోతున్న ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకుంటారని కలెక్టరు ఆశాభావం వ్యక్తం చేశారు . జిల్లా వ్యాప్తంగా 2409 పోలింగ్ కేంద్రాల పరిధిలో 20,04,417 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని కలెక్టరు తెలిపారు . వీరిలో పురుషులు 9,91,054 మంది , మహిళలు 10,13,253 మంది , ఇతరులు 110 మంది ఓటర్లు ఉన్నారన్నారు . ఎన్నికల నిర్వహణకోసం 17,204 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని ఇంతియాజ్ తెలిపారు . రిటర్నింగ్ అధికారులు 46 మంది , అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు 46 మంది పిఓలు 3,150 మంది , ఏపిఓలు 3,152 మంది పోలింగ్ సిబ్బంది 9,335 మంది విధుల్లో పాల్గొంటారన్నారు . ఎ న్నికల ప్రక్రియను పరిశీలించేందుకు గాను జోనల్ అధి కారులు 160 మంది , రూట్ ఆఫీసర్లు 280 మంది , మైక్రో అబ్జర్వర్స్ 679 మంది , ఫ్లయ్యింగ్ స్క్వాడ్స్ 98 మంది , యంసిసి బృందాలు 92 మంది , సర్వైయల్ టీమ్స్ 91 మంది , అకౌంటింగ్ టీమ్స్ 75 మంది పాల్గొంటారన్నారు . మొత్తం 125 జోన్ లు , 234 రూట్లలో రూట్ మ్యాప్ సిద్ధం చేశావున్నారు . మొత్తం 11,883 బ్యాలెట్ బార్లు సిద్ధంగా ఉన్నాయన్నారు . పోలింగ్ సిబ్బందికి ఏప్రిల్ 4 న , మైక్రో పరిశీలకులకు ఏప్రిల్ 5 న , కౌంటింగ్ సిబ్బందికి 6 వ తేదీన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో 49 మండలాలు ఉండగా , 41 మండలాల పరిధిలోని జడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు . మచిలీపట్నం , పెనమలూరు , జగ్గయ్యపేట మండలాల్లో గ్రామాల విలీనం నేపథ్యంలో జడ్ పిటిసి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . ఉంగుటూరు , మండవల్లి జడ్ పిటిసి స్థానాలు ఏకగ్రీవం అవ్వడంతోనూ , గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్ధులు మరణించినందున జి.కొండూరు , విస్సన్నపేట , పెడన జడ్ పిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న 41 జడ్ పిటిసి స్థానాలకు 159 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు . 49 జిల్లాలో మండలాల పరిధిలోని 648 యంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు . మొత్తంలో 69 యంపిటిసి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయని , గ్రామాల విలీనం , తదితర కారణాల వలన 89 స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని , 6 స్థానాల్లో గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్ధులు మరణించిన కారణంగా ఎన్నికలు నిర్వహించడం  లేదన్నారు .
అవి నాగాయలంక ( పర్రచివార ) , ముదినేపల్లిలోని ముదినేపల్లి -2 , వనుదుర్రు , గన్నవరంలో అల్లాపురం , పెనుగ్రంచిపోలులో కొనకంచి , నూజివీడులో దేవరగుంట యంపిటిసి స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు . ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ఏప్రిల్ 8 వ తేది ఉ . 7 గంటల నుంచి సా . 5 గంటల వరకు జరుగుతుందని , అప్పటికీ క్యూ లైన్ లలో ఉన్నవారందరికీ ఓటుహక్కు కల్పిస్తామని కలెక్టరు ఇంతియాజ్ తెలిపారు. 6వ తేది మంగళవారం సా. 5 గంటలతో అభ్యర్ధులు ప్రచారాన్ని ముగించాలన్నారు. జిల్లాలోని 23 కేంద్రాలు ద్వారా ఎన్నికల సామాగ్రి పంపిణి , కౌంటింగ్ ప్రక్రియ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని మొత్తం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పుడు జరగబోయే జడ్ పిటిసి , యంపిటిసి స్థానాలకు కూడా అధిక శాతంలో ఓటింగ్ నమోదు అవుతుందని విలేఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కలెక్టరు తెలిపారు . కోవిడ్ వ్యాక్సిన్‌కు సంబంధించి ఎ టువంటి ఇబ్బందులు లేవని, మెడికల్ సిబ్బందిని ఎన్నికల విధుల్లో భాగస్వాములను చేయలేదని ఆయన తెలిపారు.

Just In...