Published On: Mon, Apr 5th, 2021

ఉత్సాహంగా మాంటిస్సోరి మ‌హిళా డిగ్రీ క‌ళాశాల ప్రెష‌ర్స్ డే వేడుక‌లు

విజ‌య‌వాడ ఎడ్యుకేష‌న్‌, సెల్ఐటి న్యూస్‌‌: మాంటిస్సోరి మ‌హిళా డిగ్రీ క‌ళాశాల ప్రెష‌ర్స్ డే వేడుక‌లు ఆనందోత్సాహాల న‌డుమ సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగాయి. 2020 బ్యాచ్‌కి చెందిన విద్యార్థినీలు క‌ళాశాల ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన ఈ వేడుక‌లు ఆద్యాంతం ఉత్సాహ‌భ‌రితంగా సాగాయి. వేడ‌క‌ల్లో భాగంగా బీకాం మొద‌టి సంవ‌త్స‌రం పి.మౌనిక బృందం రెట్టించిన ఉత్సాహంతో పాల్గొని ప్ర‌ద‌ర్శించిన నృత్యాలు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. అదేవిధంగా ష్యాష‌న్ షో కార్య‌క్ర‌మంలో విద్యార్థినులు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తూ హొయ‌లు ఒల‌క‌బోశారు. అనంత‌రం క‌ళాశాల ప్రిన్సిప‌ల్స్ డాక్ట‌ర్ ఎ.శ్రీల‌క్ష్మి, కె.జాస్మిన్‌ మాట్లాడుతూ త‌మ క‌ళాశాల‌లో రెండు, మూడు సంవ‌త్స‌రం విద్యార్థినులు మొద‌టి సంవ‌త్స‌రం విద్యార్థినుల‌కు ప్రెష‌ర్స్ డే నిర్వ‌హించార‌ని తెలిపారు. కోవిడ్ కార‌ణంగా వేడుక‌ల్లో కేవ‌లం విద్యార్థినుల‌కు మాత్ర‌మే అనుమ‌తిచ్చిన‌ట్లు చెప్పారు. కోవిడ్ నిబంధ‌నల్లో భాగంగా మాస్క్‌లు ధ‌రించి, భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థినులు ప్రెష‌ర్స్ వేడుక‌లు జరుపుకున్న‌ట్లు పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో సాంస్క్ర‌తిక కార్య‌క్ర‌మాల‌కు పెద్ద‌పీట వేస్తామ‌ని తెలిపారు. క‌ళాశాల క‌ర‌స్పాండెంట్ అవిర్నేని రాజీవ్ పాల్గొని ప్రెష‌ర్స్ డే వేడుక‌లో పాల్గొన్న విద్యార్థినులకును అభినంద‌న‌లు తెలిపారు. 

Just In...