Published On: Tue, Apr 6th, 2021

ఎంపీటీసి, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌కు వ్యూహాత్మ‌క బందోబ‌స్తు

* విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు
* గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శుల‌కు దిశానిర్దేశం
విజ‌య‌వాడ క్రైం, సెల్ఐటి న్యూస్‌: ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి వ్మూహాత్మకంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జ‌రిగింద‌ని విజయవాడ పోలీస్ శాఖ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల నేప‌ధ్యంలో సిటీ ఆర్మ్డ్  గ్రౌండ్‌లో సోమ‌వారం గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీస్ కమీషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ  విజయవాడ నగర పోలీస్ కమిషన‌రేట్ పరిధిలో గతంలో  రెండు విడతలుగా జరిగిన పంచాయతీ, పురపాలక, నగరపాలక ఎన్నికలలో మహిళా పోలీసు సిబ్బందితో
పాటు గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు కూడా అంకిత భావంతో సమర్ధవంతంగా విధులు నిర్వహించారని, అలాగే ఈ నెల 8వ తేదీన విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగే ఎం.పి.టి.సి. మరియు జడ్.పి.టి.సి. ఎన్నికలకు కూడా మరో సవాలుగా పరిగణిస్తూ, ఎన్నికలకు వ్మూహాత్మకంగా బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బంది క్యూలైన్లలో వచ్చే వారిని గమనించి ఎన్నికల సంఘం తెలియజేసిన నిషేధిత వస్తువులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించరాదని, ఓటర్ల గుర్తింపు కార్డులు క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి
అనుమతించాలన్నారు. పోలింగ్ స్టేషన్‌కు 100 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడకుండా చూసుకుంటూ 144వ సెక్షన్ సి.ఆర్.పి.సి. అమలులో ఉన్న విషయం తెలియజేయాలని, పోలింగ్ కేంద్రం వద్ద ఏవైనా అలజడులు, అవాంఛనీయ సంఘటనలు జరిగితే వెంటనే స్పందించి సంబంధిత పోలీస్ మొబైల్ పార్టీ వారికి మరియు ఎస్‌హెచ్‌ఓకు తెలియజేయాలన్నారు. విధులు నిర్వహించే సమయంలో రాజకీయ పార్టీల గురించి గానీ, వ్యక్తుల గురించి గానీ ఎవరితోనూ వాదోపవాదాలకు తావులేకుండా సమయస్ఫూర్తితో వ్యహరించాలని, అక్కడ ఏదైనా సమస్య ఉత్పన్నమైనప్పుడు సందర్భాన్ని బట్టి, విచక్షణతో వాటిని పరిష్కరించాలని, పోలీసులు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు పరస్పరం సహకరించుకుంటూ బందోబస్తు విధులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్-1 డీసీపి వి.హర్షవర్ధనరాజు, అడ్మిన్ డిసిపి  మేరీ ప్రశాంతి, విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్.ఐ.లు, గ్రామ/వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శులు, సచివాలయ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
 

Just In...