Published On: Thu, Apr 8th, 2021

సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీలోకి తెదేపా నేత‌లు

* కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: బాపట్ల టీడీపీ మాజీ ఎమ్మెల్యే మంతెన అనంత వర్మ ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్‌మెహ‌న్‌రెడ్డి సమక్షంలో తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో బుధ‌వారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంత వర్మతో పాటు సీఎం జ‌గ‌న్ స‌మక్షంలో పార్టీలో చేరిన స్ధానిక టీడీపీ నేతలు మంతెన సుబ్బరాజు, వి.వెంకటేశ్వరరాజు, ఎం.వి.సర్వేశ్వర యాదవ్, పృద్వీరాజు, మంతెన నాగరాజు, బాపూజీ, మోదుగుల వెంకటరెడ్డిల‌కు సీఎం జ‌గ‌న్ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్‌
కోన రఘుపతి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.

Just In...