Published On: Tue, Jun 29th, 2021

ఎస్‌ఐపీబీలో రిటైల్‌ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం

* పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిసిన బోర్డు

* రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్‌ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌

* 75శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని స్పష్టంచేసిన సీఎం వైయస్ జగన్‌

అమ‌రావ‌తి బ్యూరో, సెల్ఐటి న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం ల‌భించింది. ఎస్‌ఐపీబీలో రిటైల్‌ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం ల‌భించింది. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో మంగ‌ళ‌వారం సాయంత్రం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధ్య‌క్ష‌త‌న స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం నిర్వ‌హించారు. ఇందులో పలు పరిశ్రమల ఏర్పాటు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్‌ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ.. ఏర్పాటవుతున్న పరిశ్రమల వల్ల పర్యావరణంపై ప్రభావాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. జాగ్రత్తలు తీసుకుంటూ పారిశ్రామిక ప్రగతిలో ముందడుగు వేయాలని సీఎం సూచించారు. కడప సమీపంలో కొప్పర్తి వద్ద పిట్టి రెయిల్‌ ఇంజినీరింగ్‌ కాంపోనెంట్స్‌ లిమిటెడ్‌కు అంగీకారం. ఎలక్ట్రికల్,
లోకోమోటివ్, విద్యుత్తు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలు ఇక్కడ తయారీ , ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా 2వేల మందికి ఉద్యోగాలు. మొత్తంగా రూ.401 కోట్ల పెట్టుబడి పెట్టనున్న కంపెనీ. కడప సమీపంలోని కొప్పర్తి వద్ద నీల్‌కమల్‌ లిమిటెడ్‌కూ బోర్డు అంగీకారం. నీల్‌కమల్‌కు దేశవ్యాప్తంగా పలు పరిశ్రమలు. అన్నిటి కంటే ఇక్కడ పెద్ద పరిశ్రమలను ఏర్పాటు చేయనున్న నీల్‌కమల్‌. రూ.486 కోట్ల పెట్టుబడి పెట్టనున్న నీల్‌కమల్‌. ప్రత్యక్షంగా 2030 మంది ఉద్యోగాలు. ఫర్నీచర్‌ మరియు ఇతర గృహోపకరణాల తయారీ. నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీంలో గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌ విస్తరణకు బోర్డు ఆమోదం. ఫోర్డ్, హ్యుందాయ్, ఫోక్స్‌వాగన్‌ తదితర కంపెనీలకు స్టీల్, ఐరన్‌ ఉత్పత్తులు అందిస్తున్న గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌. జపాన్, కొరియాకు చెందిన అత్యాధునిక రోబోటిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీ. జర్మనీ నుంచి ఐఎల్‌టీ ప్లాస్మా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్న గ్రీన్‌టెక్‌. ప్రస్తుతం 2700 మందికి ఉద్యోగాలు, విస్తరణ ద్వారా అదనంగా 2200 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు. ఇప్పటికే రూ.750 కోట్ల పెట్టుబడి, విస్తరణ ద్వారా మరో రూ.627 కోట్ల పెట్టుబడి పెట్టనున్న గ్రీన్‌ టెక్‌. చిత్తూరు జిల్లా జిల్లా నిండ్ర మండలం ఎలకటూరులో అమ్మయప్పర్‌ టెక్స్‌టైల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమకు బోర్డు అంగీకారం. సుమారు రూ.30 కోట్ల పెట్టుబడి, 2304 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. ఇందులో
90శాతం మహిళలకే ఉద్యోగాలు. పురుషులు, పిల్లల బట్టలు తయారీ. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి గ్రామం తమ్మినపట్నం వద్ద జిందాల్‌ స్టీల్‌ ఆంధ్రా లిమిటెడ్‌కు 860 ఎకరాలు తక్కువ ఖర్చుకు ఇచ్చేందుకు ఎస్‌ఐపీబీ ఆమోదం. 2.25 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి జిందాల్ స్టీల్‌‌ ఆంధ్రా లిమిటెడ్‌ ఏర్పాట్లు. తద్వారా నాలుగేళ్లలో 2500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు. మొత్తంగా రూ.7500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న జిందాల్‌ స్టీల్ ఆంధ్రా లిమిటెడ్‌ విశాఖపట్నం జిల్లా అచ్చుతాపురంలో నిర్మాణం అవుతున్న సెయింట్‌ గోబియాన్‌ పరిశ్రమకు ఏర్పాటుకు డెడ్‌లైన్‌ను పొడిగింపునకు ఎస్‌ఐపీబీ ఆమోదం. కోవిడ్‌ పరిస్థితులు కారణంగా ఫ్యాక్టరీ నిర్మాణ గడువును పెంచాలని కోరిన సెయిట్‌ గోబియాన్‌. జూన్‌ 2022 వరకూ పెంచుతూ నిర్ణయం. మూడు దశల్లో రూ.2001 కోట్ల పెట్టుబడి పెడుతున్న సెయింట్‌ గోబియాన్‌. టెక్స్‌టైల్స్, గార్మెంట్స్‌ మార్కెట్‌ ప్లేస్‌లో భాగంగా మెగా రిటైల్‌ పార్క్‌ నిర్మాణానికి ఎస్‌ఐపీబీ ఆమోదం. గుంటూరు జిల్లా తాడేపల్లిలో 5 ఎకరాల స్థలంలో రిటైల్‌ బిజినెస్‌ పార్క్‌. రూ. 194.16 కోట్ల పెట్టుబడి. పార్క్‌లో భాగంగా 900 వరకూ రిటైల్‌ యూనిట్స్‌. సుమారు 5వేల మందికిపైగా ప్రత్యక్షంగా మరో 20వేల మందికి పరోక్ష ఉద్యోగాలు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా కొనుగోలు, విక్రయాలకు హబ్‌గా ఈ పార్క్‌ ఏర్పాటు. రాష్ట్రంలో తయారయ్యే వాటిలో దాదాపు 70శాతం విక్రయాలు ఇక్కడ నుంచే జరుగుతాయని అంచనా. పార్క్‌లో భాగంగా ఏర్పాటవుతున్న స్టోర్స్‌ నుంచి ఒక్కో స్టోర్‌లో ఏడాదికి సుమారు రూ.11 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. ఎస్‌ఐపీబీలో రిటైల్‌ పాలసీకి సూత్రప్రాయ అంగీకారం. సమావేశంలో ఉపముఖ్యమంత్రి (రెవెన్యూశాఖ) ధర్మాన కృష్ణదాస్, ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, కార్మికశాఖ మంత్రి జి.జయరాం, సీఎస్‌ ఆదిత్యనాధ్‌ దాస్, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జేవియన్‌ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Just In...