Published On: Sun, Jul 4th, 2021

క‌ల్తీ లేకుండా త‌క్కువ ధ‌ర‌లో స‌రుకులందిస్తాం…

* “విజయ బ్రాండ్” సరుకులు మార్కెట్‌లోకి విడుదల

* ఏపి ఆయిల్ ఫెడ్ డెరెక్ట‌ర్‌, యండి ఎస్.శ్రీకాంతనాధ‌రెడ్డి

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర ప్రజలకు కల్తీ లేని నాణ్యమైన నిత్యావసర సరుకులను ఏపి ఆయిల్ ఫెడ్ ద్వారా విజయ బ్రాండ్ నిత్యావసర సరుకుల ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు ఏపి ఆయిల్ ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్, యండి. శ్రీకాంతనాధ‌రెడ్డి తెలిపారు. ఏపి ఆయిల్ ఫెడ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు ఆదివారం విజయవాడ ఆటోనగర్‌లోని ఎపి స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ భవనం నందు మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వై.మధుసూదనరెడ్డి పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్కెట్లోకి విడుదల చేసినట్లు యం.డి ఎస్.శ్రీకాంతనాధ‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గడ‌చిన 35ఏళ్లుగా ఆయిల్ ఫెడ్ ద్వారా ప్రజలకు సేవలందిస్తున్నామన్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్వచ్ఛమైన విజయ బ్రాండ్ ఆయిల్‌ను మార్కెట్‌లో వినియోగదారులకు తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. తెలుగింటి లోగిళ్లల్లో విజయ ఉత్పత్తులను మరింత పెంచాలనే ఉద్దేశ్యంతో నాణ్యమైన, కల్తీలేని నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువెళ్లేందుకు ఎపి ఆయిల్ ఫెడ్ ప్రభుత్వ రంగ సంస్థ కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా విజయ బ్రాండ్ పేరుతో మినపప్పు, పసుపు, కారం, రాగిపిండి, జోన్నపిండి, బాసుమతి బియ్యం, వేరుశనగగుళ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి నిత్యావసర సరుకులను మార్కెట్లోకి  విడుదల చేయడం జరిగిందన్నారు. గత ఏడాది నుండి కరోనా విపత్తును ప్రజలు ఎదుర్కొంటున్న పరిస్థితులను గమనించి లాభాపేక్ష లేకుండా సరసమైన ధరకే ప్రభుత్వరంగ సంస్థ ద్వారా అమ్మకాలు, నిర్వహించాలని నిర్ణయించి వినియోగదారులకు నాణ్యమైన సరుకులను తక్కువ ధరకే అంధుబాటులోకి తీసుకొచ్చిన్నట్లు వివరించారు. యూనిస్టెప్ ఎల్.ఎల్‌. పి సహకారంతో విజయ  ఉత్పత్తులను మార్కెటింగ్ చేయునున్నట్లు తెలిపారు. విజయ బ్రాండ్ నిత్యావసర సరుకులు రానున్న వారం రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యంగా వినియోగదారుల సౌకర్యార్థం త్వరలో విజయ బ్రాండ్ ఉత్పత్తుల అవుట్‌లెట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఏపి ఆయిల్ ఫెడ్ సంస్థ ఆలోచన చేస్తుందని ఎస్.శ్రీకాంతనాధ‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఎపి ఆయిల్ ఫెడ్ జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, టెక్నికల్ మేనేజర్ సుధాకర్‌రావు, గుడ్విల్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ వెంకట్రామరెడ్డి, ఆయిల్ ఫెడ్ అధికారులు, సిబ్బంది, వివిధ జిల్లాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు పాల్గొన్నారు.

Just In...