Published On: Tue, Jul 13th, 2021

సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా

* ఒక్కరోజు ముందు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: ఏపీ సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి బుధ‌వారంనాడు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు  న్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ఈ మేర‌కు ముఖ్యమంత్రి కార్యాలయం మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించింది. ఈ నెల 14న సీఎం జగన్ పోలవరం పర్యటనకు వెళ్లబోవడంలేదని తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందుకోసం బుధ‌వారం పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని ఆయ‌న నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తిరిగి ఎప్పుడు పోలవరం వెళ్లాలనేది తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు.

Just In...