Published On: Mon, Jul 19th, 2021

విదేశీ విద్యా స‌మాచారం ఇప్పుడు అందుబాటులో…

* స‌ద‌స్సులు నిర్వ‌హ‌ణతో విద్యార్థుల‌కు మార్గం సుగ‌మం

* విదేశీ ఉన్న‌త విద్య‌పై ఈ నెల 24, 31, ఆగ‌ష్టు 7 తేదీల్లో వ‌ర్చువ‌ల్‌గా స‌ద‌స్సులు

* ఏపిటిపివో రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఎన్‌.వి.సురేంద్ర‌బాబు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో విద్యార్హ‌త అనేది ఎంతో ముఖ్య‌మైంద‌ని, ఉన్న‌త విద్య‌కు పెరుగుతున్న ఆద‌ర‌ణ దృష్ట్యా విద్యా సద‌స్సులు విద్యార్థుల‌కు ఎంత‌గానో మేలు చేకూరుస్తాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీస‌ర్స్ అసోసియేష‌న్ (ఏపిటిపివో) రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ ఎన్‌.వి.సురేంద్ర‌బాబు అన్నారు. ఏఈసీసీ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ క‌న్స‌ల్టెన్సీ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 24, 31, ఆగ‌ష్టు 7 తేదీల్లో నాలుగు దేశాల‌కు సంబంధించి జ‌ర‌గ‌బోయే ఇండియాస్ బిగ్గెస్ట్ వ‌ర్చువ‌ల్ ఎడ్యుకేష‌న్ ఫెయిర్ నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి పోస్ట‌ర్ల‌ను శ‌నివారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ ఎన్‌.వి.సురేంద్ర‌బాబు మాట్లాడుతూ.. విదేశీ విద్యా స‌ద‌స్సులు ద్వారా విద్యార్థులు వారికి కావాల్సిన స‌మాచారాన్ని నేరుగా విదేశీ విశ్వ‌విద్యాల‌యాలు నుంచి తెలుసుకునే అవ‌కాశం ఉంటుంద‌న్నారు. అలాగే.. ఉప‌కార వేత‌నాలు, కోవిడ్ మ‌హ‌మ్మారి కార‌ణంగా వ‌చ్చిన మార్పులు, ఆన్‌లైన్ త‌ర‌గ‌తులు త‌దిత‌ర అంశాలు గురించి తెలుసుకునే అవ‌కాశం విద్యా స‌ద‌స్సు ద్వారా విద్యార్థులు తెలుసుకోవ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు. ముఖ్యంగా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆస్ట్రేలియా, కెన‌డా, యు.కె, యుఎస్ఎ దేశాల్లో విద్య‌న‌భ్య‌సించే వారి సంఖ్య పెరిగింద‌న్నారు. ఇందుకు కార‌ణం అక్క‌డ విద్యార్థుల‌కు క‌ల్పిస్తున్న మౌలిక స‌దుపాయాలు, రీసెర్చ్, ఉన్న‌త ప్ర‌మాణాలు క‌లిగి ఉండ‌డ‌మే విద్యార్థుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. వ‌ర్చువ‌ల్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న విజ‌య‌వాడ ఏఇసీసీ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ క‌న్స‌ల్టెన్సీ ప్ర‌తినిధులు రాజ్‌కుమార్ నున్న‌, రాజేంద్ర త‌దిత‌రులు మాట్లాడుతూ… ఈ నెల 24, 31, ఆగ‌సష్టు 7 తేదీల్లో జ‌ర‌గ‌బోయే ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌లో పాల్గొనే విద్యార్థుల‌కు ప్ర‌వేశం ఉచితం అని తెలిపారు. విదేశీ ఉన్న‌త విద్య కోసం ప్ర‌య‌త్నించేవారు ఎవ‌రైనా జూమ్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో ఎక్క‌డ నుంచైనా పాల్గొన‌వ‌చ్చ‌ని పేర్కొన్నారు. ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌లో 100కుపైగా విదేశీ విశ్వ‌విద్యాల‌యాలు పాల్గొని విద్యార్థుల‌ను సందేహ‌ల‌ను నివృత్తి చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ప్ర‌తి ఏడాది ఈ కార్య‌క్ర‌మాన్ని నేరుగా నిర్వ‌హించేవార‌మ‌ని. కోవిడ్ కార‌ణంగా ఈ ఏడాది అంద‌రికీ అందుబాటులో ఉండేలా వ‌ర్చువ‌ల్‌గా నిర్వ‌హిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఎడ్యుకేష‌న్ ఫెయిర్‌లో విద్యార్థులు అంద‌రూ పాల్గొని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు. దేశ‌వ్యాప్తంగా వ‌ర్చువ‌ల్ విద్యా స‌ద‌స్సులో పాల్గొనాల‌నుకునేవారు ” www.unisessions.aeccglobal.in లింక్‌లో లాగిన్ అయి ముందుగా రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని తెలిపారు. ఇత‌ర సందేహాల కోసం విద్యార్థులు 9030621199, 8143533633 ఫోన్ నంబ‌ర్ల‌ను సంప్ర‌దించాల‌న్నారు. ఈ సంద‌ర్భంగా బెంజిస‌ర్కిల్ వ‌ద్ద ఉన్న ఏఇసీసీ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ క‌న్స‌ల్టెన్సీ కార్యాల‌యంలో పోస్ట‌ర్లను ఆవిష్కంచారు. కార్య‌క్ర‌మంలో ఏఈసీసీ గ్లోబ‌ల్ ఎడ్యుకేష‌న్ క‌న్సల్టెన్సీ ప్ర‌తినిధులు అమృత‌, అస్మ‌, దీపికా, కిర‌ణ్మ‌యి, మృదుల‌, స‌ద్దాం, ప్రియాంక త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...