Published On: Wed, Jul 21st, 2021

అట్రాసిటీ కేసుల‌పై వేగంగా చ‌ర్య‌లు తీసుకోండి…

* అప‌రిష్కృత కేసుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టండి

* ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల పరిష్కార జిల్లా స్థాయి ప‌ర్య‌వేక్ష‌ణ క‌మిటీ స‌మావేశంలో క‌లెక్ట‌ర్ నివాస్‌ 

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్‌: ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసుల సత్వర పరిష్కారంలో పూర్తి చొరవ చూపి కేసుల పెండెన్సీ తగ్గించాలని సంబంధిత అధికారులను కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుల పరిష్కార జిల్లా స్థాయి మోనటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ 2019 నుండి ఇంతవరకు ఎన్టీ ఎస్ సి అట్రాసిటి కేసుల కింద 397 కేసులు నమోదు కాగా వాటి విచారణ అనంతరం 187 కేసులు సంబందించి రూ.1.96 కోట్లు పరిహారం మంజూరు చేశారన్నారు. 70 కేసులను అసత్య కేసులుగా గుర్తించారని మిగిలిన కేసులు పరిష్కార దిశలో ఉన్నాయన్నారు. ఈ కేసుల సత్వర పరిష్కారానికి సంబంధిత పోలిస్ డివిజన్ వారిగా జాబితాలను పంపాలని సోషల్ వెల్పెర్ డిడిని కలెక్టర్ ఆదేశించారు. ఈ కేసులకు సంబంధించి చార్జిషీట్ నమోదు చేయడం వంటి చర్యల్లో వేగం పెంచడం ద్వారా భాధితులకు ప్రభుత్వం కల్పించే పెన్షన్, ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం వుందన్నారు. ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీ కేసులకు సంబంధించి ఏ భాధితుడు పరిహారం పొందకుండా నిరిక్షించే పరిస్థితి ఉండకూడదన్నారు. ఆ దిశగా పోలీస్ రెవెన్యూ సంబంధిత శాఖధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టులో ఫైల్ చేసి స్టేలో ఉన్న కేసులకు స్టే తొలగింపు విషయంపై సంబంధిత అధికారులను సంప్రదించాలన్నారు. ప్రతి నెల 30వ తేదీ మండలాల్లో సివిల్ రైట్స్ డే ఖచ్చితంగా నిర్వహించడమే కాకుండా ముందస్తుగా సభ్యులకు సమాచారం తెలియజేయాలని, సమావేశాలను కేవలం ఎస్ సి ఎస్ నివాసిత ప్రాంతాలనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించాలన్నారు. జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ప్రతి కేసులో 60 రోజులు మించకుండా చార్జి షిట్ నమోదు చేయడం జరగుతుందన్నారు.  ఇతర జిల్లాలో పోలిస్తే జిల్లాలో ఎక్కువ కేసులు లేనేప్ప‌టికీ ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ విషయంపై దృష్టి పెట్టామన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ సమయంలో మేజిస్టేట్ హోదా వున్న తాహశీల్దార్ల సహాకారం ఎంతైన వుందన్నారు. డిసిపి డి.మేరి ప్రశాంతి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కరంలో విచారణకు అవసరమైన కుల దృవీకరణ పత్రాలు జారిలో జాప్యం లేకుండా చూడాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) కె.మోహన్‌కుమార్, విజయవాడ సబ్ కలెక్టర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, డిఆర్‌వో యం.వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు, ఖజావలి, ఆర్.శ్రీనివాసకుమార్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ సరస్వతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడి మురళి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రుక్మాందయ్య, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కె.చంద్రశేఖర్, విజయకుమార్, బి.సేహ్న,  పలువురు ఎసిపిలు, డిఎస్పీలు, తదితరులు పాల్గొన్నారు.

Just In...