Published On: Mon, Aug 2nd, 2021

పాత్రికేయుల‌కు త్వ‌రిత‌గ‌తిన అక్రిడిటేష‌న్ అందించండి

* కలెక్టర్‌ని కలిసిన ఆంధ్ర‌ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య ప్రతినిధులు

విశాఖపట్నం, సెల్ఐటి న్యూస్‌: అక్రిడిటేష‌న్‌ల జారీ విష‌యంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఆంధ్ర‌ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమాఖ్య ప్రతినిధులు సోమ‌వారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ మ‌ల్లిఖార్జున్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సంద‌ర్భంగా ఏపి వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్ట్ సమాఖ్య విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు శ్రీహరి, ఉపాధ్యక్షులు దొడ్డి చందు, వాండ్రాసి నాగసత్యనారాయణ, కార్యదర్శులు రావు, హరికృష్ణ, సంతోష్‌కుమార్, సురేష్, వారణాసి. పృద్విరాజ్ పాల్గొని క‌లెక్ట‌ర్‌కి మొక్క‌ను బ‌హుక‌రించారు. జ‌ర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడిటేష‌న్ సమస్యల‌ను జిల్లా క‌లెక్ట‌ర్‌కి వివరించారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ మ‌ల్లిఖార్జున్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్ట్‌కి అక్రిడిటేష‌న్ కార్డులు ఇస్తామన్నారు. ఈ సంద‌ర్భంగా ఏపి వర్కింగ్ జర్నలిస్టు సమాఖ్య విశాఖ జిల్లా ‌అధ్య‌క్షుడు శ్రీహరి మాట్లాడుతూ.. పరిపాలన రాజధానిగా మదురవాడను ముఖ్యమంత్రి ప్రకటించార‌ని .. అయినప్పటికీ మధురవాడలో ప్రెస్‌క్లబ్‌, గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ని కోర‌గా.. క‌లెక్ట‌ర్ సానుకూలంగా స్పందించారు.

 

Just In...