Published On: Tue, Aug 3rd, 2021

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన…

* మేయ‌ర్ రాయ‌న భాగ్యల‌క్ష్మి

విజ‌య‌వాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, సెల్ఐటి న్యూస్‌: ప్రజల నుంచి వచ్చిన సమస్యల అర్జీల‌ను క్షేత్ర స్థాయిలో పరిశిలించి సత్వరం పరిష్కరించాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. విజ‌య‌వాడ నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మేయ‌ర్ భాగ్య‌ల‌క్ష్మి స్వయంగా ప్రజల నుంచి అర్జీల‌ను స్వీకరించారు. ప్ర‌జ‌లు సమర్పించిన అర్జీలను పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ ప్రణాళిక -4, పబ్లిక్ హెల్త్-1, యు.సి.డి-5, ఇంజనీరింగ్- 5, పేషి రిమర్క్స్ -2 మొత్తం 17 అర్జీలు స్వీక‌రించిన‌ట్లు వివ‌రించారు.

Just In...