Published On: Tue, Aug 3rd, 2021

టీడీపీ పాల‌న‌లో ప్ర‌యివేట్ వ్య‌క్తుల‌ దోపిడి సాగింది

* ప్ర‌భుత్వ సంస్థ‌లు బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా వైసీపీ పాల‌న

* రూ.80 లక్షలతో అర్బన్ హెల్త్ సెంటర్‌కు శంఖుస్ధాపన కార్య‌క్ర‌మంలో మంత్రి వెలంప‌ల్లి

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌, సెల్ఐటి న్యూస్‌: టిడిపి పాల‌నలో ప్ర‌యివేట్ సంస్థ‌లు, వ్య‌క్తుల‌ను బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా పాల‌న సాగింద‌ని దేవాదాయ ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం 42వ డివిజను భవానీపురం హౌసింగు బోర్డు కాలనీలో రూ.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేయనున్న అర్బన్ హెల్త్ సెంటర్‌కు మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు శంఖుస్ధాపన చేశారు.. కార్య‌క్ర‌మంలో న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, డిప్యూటి మేయ‌ర్ ఆవుతు శైల‌జరెడ్డి, 42వ డివిజన్ కార్పొరేటర్ ప‌డిగ‌పాటి చైతన్యరెడ్డి న‌గ‌ర పాల‌క సంస్థ అధికారులు ఉన్నారు. నాడు నేడుతో ప్ర‌భుత్వ సంస్థ‌ల బ‌లోపేత‌మే ల‌క్ష్యంగా వైసీపీ ప్ర‌భుత్వం ప‌నిచేస్తుందన్నారు. పేద‌ల‌కు విద్యా, వైద్యం అందించాల‌నే ల‌క్ష్యంగా జ‌గ‌న‌న్న హ‌యంలో పాలన సాగుతుంద‌ని పేర్కొన్నారు. ప్ర‌తి పార్ల‌మెంట్ నియెజ‌క‌వ‌ర్గానికి మెడిక‌ల్ కాలేజి, ప్ర‌తి పేద‌వారికి వైద్యం అందించాల‌నే ఉద్దేశ్యంతోనే అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం చేపడుతున్న‌ట్లు వివ‌రించారు. న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మీ మాట్లాడుతూ… న‌గ‌రంలో ప్ర‌జ‌లంద‌రికీ విద్య, వైద్యం అందించాల‌నే మంచి ఉద్దేశ్యంతోనే వైసీపీ ప్ర‌భుత్వం నాడు నేడు పేరిట స్కూల్స్ అభివృద్ది చేస్తన్నార‌న్నారు. అదే విధంగా న‌గ‌రంలో ఇప్ప‌టికే 12 అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నాయ‌ని, వాటికి అద‌నంగా మ‌రో 11 అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మాణం చేప‌ట్టిన్న‌ట్లు వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయ‌లు క‌ల్పించేందుకు న‌గ‌ర పాలక సంస్థ సిద్దంగా ఉంద‌న్నారు. జ‌గ‌న‌న్న హ‌యంలో న‌గ‌రం అభివృద్ది ప‌ధంలో దూసుకెళుతుందన్నారు.

Just In...