Published On: Tue, Sep 14th, 2021

స్పందనతో ప్రజల స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

విజయవాడ నగర పాలక సంస్థ, సెల్ఐటి న్యూస్: న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో జ‌రుగుతున్న స్పంద‌న‌తో ఆర్జీదారుల స‌మ‌స్య‌కు త‌క్ష‌ణ‌మే ప‌రిష్కారం ల‌భిస్తుంద‌ని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. సోమ‌వారం న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో కమిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్, మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు బాధితుల నుంచి ఆర్జీల‌ను స్వీక‌రించారు.. ఆర్జీదారుల‌ సమస్యకు న‌గ‌ర పాల‌క సంస్థ ప‌రిధిలో తగు విచారణ జరిపి, చట్ట పరిధిలో పరిష్కారం అందిస్తున్నామన్నారు.
స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 1, ఇంజనీరింగ్ – 2, పట్టణ ప్రణాళిక -5, పబ్లిక్ హెల్త్ – 1, యు.సి.డి విభాగం – 4, స్పెషల్ ఆఫీసర్ (WS) – 1 మొత్తం 14 అర్జీలు స్వీక‌రించిన్న‌ట్లు వివ‌రించారు.
కార్యక్రమంలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, చీఫ్ ఇంజ‌నీర్ ప్ర‌భాక‌ర్ రావు, ఎస్.ఇ. నరశింహమూర్తి, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్ త‌దిత‌రులు ఉన్నారు.
సర్కిల్ కార్యాలయాలలో స్పందన
సర్కిల్ – 1 కార్యాలయంలో – 0
సర్కిల్ – 2 కార్యాలయంలో – 3 అర్జీలు ఇంజనీరింగ్ -1, యు.సి.డి విభాగం – 4, ఉద్యాన వన విభాగమునకు సంబందించి -1
సర్కిల్ – 3 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగమునకు సంబందించి-1 ఆయా కార్యాలయాలలోని జోనల్ మరియు అసిస్టెంట్ కమిషనర్ లకు అందించుట జరిగింది.

Just In...