Published On: Wed, Feb 13th, 2019

16న జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కానికి శ్రీ‌కారం

* రాయ‌దుర్గంలో ప్రారంభించ‌నున్న మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు

సెల్ఐటి న్యూస్‌, అమ‌రావ‌తి: రాష్ట్రంలో జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణ కార్య‌క్ర‌మానికి ఈ నెల 16న అనంత‌పురం జిల్లాతో శ్రీ‌కారం చుట్ట‌నున్నారు. రాష్ట్ర స‌మాచార పౌర‌సంబంధాలు, గ్రామీణ గృహ‌నిర్మాణ శాఖ మంత్రి కాల‌వ శ్రీ‌నివాసులు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న రాయ‌దుర్గం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంబిస్తున్నారు. ఆరోజున నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 60 మంది జ‌ర్నలిస్టుల‌కు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రం రాయదుర్గం ప‌ట్ట‌ణంలో ఇళ్ల నిర్మాణానికి గృహాల మంజూరు ప‌త్రాలు అందించ‌డం ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. దీనితో పాటు ఇప్ప‌టికే గృహ‌నిర్మాణ ప‌థ‌కాల కింద ఇళ్లు మంజూరై గృహాలు నిర్మించుకుంటున్న జ‌ర్న‌లిస్టుల‌కు స‌మాచార శాఖ ద్వారా ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే అద‌న‌పు ప్రోత్సాహాక మొత్తాన్ని కూడా అంద‌జేస్తారు. ఫిబ్ర‌వ‌రి 18న అనంత‌పురం జిల్లా కేంద్రంలో జ‌ర్న‌లిస్టుల‌కు గృహాల మంజూరు ప‌త్రాలు అంద‌జేయ‌నున్నారు. కొడిమిలోని జ‌ర్న‌లిస్టు కాల‌నీలో 100 మంది జర్న‌లిస్టుల‌కు గృహనిర్మాణానికి మంజూరు ప‌త్రాలు అంద‌జేయ‌నున్నారు. జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణ ప‌థ‌కంపై మంత్రి స‌మాచార శాఖ జె.డి.కిర‌ణ్‌కుమార్‌, త‌న కార్యాల‌య ఓ.ఎస్‌.డి ఆర్.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌, ఏపియుడ‌బ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు మ‌చ్చా రామ‌లింగారెడ్డి త‌దిత‌రుల‌తో మంత్రి త‌న ఛాంబ‌రులో స‌మీక్షించారు. స‌మాచార శాఖ ద్వారా జ‌ర్న‌లిస్టుల గృహ‌నిర్మాణానికి అందించే రాయితీ మొత్తాన్ని గృహ‌నిర్మాణ సంస్థ‌కు బ‌దిలీ చేయాల‌ని మంత్రి జె.డి.కి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ జ‌ర్న‌లిస్టుల‌కు గృహాల మంజూరు ప‌త్రాలు అందించే కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని మంత్రి ఆదేశించారు.

Just In...