Published On: Fri, Apr 3rd, 2020

16,934 మంది నిర్వాసితులకు, వలసదారులకు వసతి సౌకర్యం…

* కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యుడు తుమ్మా విజయ్‌కుమార్ రెడ్డి

అమ‌రావ‌తి, సెల్ఐటి న్యూస్‌: రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన 238 రిలీఫ్ సెంటర్స్ ద్వారా 16,934 మంది నిర్వాసితులకు, వలసదారులకు వసతి సౌకర్యం కల్పించామని సమాచార, పౌరసంబంధాల శాఖ కమీషనర్, ప్రభుత్వ ఎక్స్ అఫీషియో ప్రత్యేక కార్యదర్శి, కోవిడ్-19 రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సభ్యులు శ్రీ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కో-ఆర్డినేషన్ టీమ్ ఏర్పాటు లో ముఖ్య ఉద్ధేశ్యం ఏ ఆధారంలేని వారికి, నిర్వాసితులకు, వలసదారులకు వసతి సౌకర్యం కల్పన తదితరమైన విషయాలను పర్యవేక్షించటమే అని అన్నారు. విజయవాడ రోడ్లు, భవనాల శాఖ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ నుంచి నిత్యవసర వస్తువుల లభ్యత, ధరలను పర్యవేక్షిస్తారన్నారు. ఈ కంట్రోల్ రూమ్ 11 ప్రభుత్వ శాఖల సౌజన్యంతో పనిచేస్తుందన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో జిల్లా జాయింట్ కలెక్టర్ల పర్యవేక్షణలో కంట్రోల్ రూమ్ లు నిర్వహించటం జరగుతుందన్నారు. స్పందన టోల్ ఫ్రీ నెంబర్ 1902 ద్వారా 3,277 సమస్యలకు పరిష్కారం లభించిందని, 24 గంటలు పనిచేసే ఈ కాల్ సెంటర్ కు ఇప్పటి వరకు 3,321 సమస్యలు నమోదు అయ్యాయని తెలిపారు. వాహనాలు మరియు వ్యక్తులకు ఆన్ లైన్ లో పాస్ లు ఇస్తున్నామని, ఇప్పటి వరకు 3,159 పాస్ లు జారీ చేశామని ఇంకా 1,281 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని ఆయన ఆ ప్రకటనలో తెలియజేశారు. త్రాగునీటి సరఫరా, పారిశుధ్ధ్యం, విద్యుత్ సరఫరా వంటి అంశాలను సంబంధిత శాఖలైన పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ లు నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నాయన్నారు.

నిత్యవసర సేవల పరిస్థితి…
క్రమ సంఖ్య సేవ పేరు సేవల నివేదిక…

1 విద్యుత్ సరఫరా సమస్య ఉత్పన్నం కాలేదు
2 నీటి సరఫరా సమస్య ఉత్పన్నం కాలేదు
3 పారిశుధ్ధ్యం సమస్య ఉత్పన్నం కాలేదు
4 ఎల్పీజీ పంపిణీ 1060 గ్యాస్ పంపిణీదారులు అందుబాటులో మరియు సరిపడా గ్యాస్ సిలిండర్ల నిల్వలు
5 MS/HSD రిటైల్ 3,310 ఔట్ లెట్లలలో 3598 పనిచేస్తున్నాయి, సరిపడా నిల్వలు ఉన్నాయి
అవుట్ లెట్స్

నిత్యవసర వస్తువుల పరిస్థితి :

మార్కెట్లు మరియు షాపులు…
క్రమ సంఖ్య విభాగం పేరు పనిచేస్తున్న విభాగం
1 రైతు బజార్లు 101
2 వికేంద్రీకృత రైతు బజార్లు 402
3 మొబైల్ రైతు బజార్లు 335
4 డోర్ డెలివరీ సేవలు 703
5 కిరాణా షాపులు 38,440
6 ఫార్మసీలు 10,916

వస్తువులు..
క్రమ సంఖ్య వస్తువు పేరు వస్తువుల అందుబాటు
1 కూరగాయలు 18,000 క్వింటాల్స్
2 పాలు 25, 24, 277 లీటర్లు
3 గుడ్లు 205.63 లక్షలు
4 బియ్యం 16, 26, 140 మెట్రిక్ టన్నులు
5 పప్పు ధాన్యాలు 2,087 మెట్రిక్ టన్నులు
6 పంచదార 4,097 మెట్రిక్ టన్నులు

Just In...