Published On: Sat, Feb 15th, 2020

17న శ్రీసిటీకి రానున్న కంచి కామకోటి పీఠాధిపతి

శ్రీసిటీ, సెల్ఐటి న్యూస్‌: ఈ నెల 17న (సోమవారం) కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు శ్రీసిటీకి విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా భక్తులు ఆయ‌న‌ను దర్శించుకొనేందుకు శ్రీసిటీ యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. హిందూ సనాతన ధర్మం, సంస్కృతీ సాంప్రదాయాల పరిరక్షణకు కృషి చేస్తున్న సద్గురువుల దర్శనం లభించడం పూర్వజన్మ సుకృతం. శ్రీసిటీ పరిసర ప్రాంతాలలో శ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు విచ్చేయడం ఇదే తొలిసారి కావ‌డంతో పాటు ఒక రాత్రి శ్రీసిటీలో బస చేయనున్నారు. ఇదొక అరుదైన అవకాశం కాగా, ఈ ప్రాంత ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి కోరారు. స్వామి సందర్శనార్థం ఇతర వివరాలకు 9490161530 ఫోన్ నెంబరును సంప్రదించాల‌న్నారు.

 

Just In...