Published On: Sat, Sep 9th, 2017

2018 మార్చి నాటికి క‌న‌క‌దుర్గ పైవంతెన పూర్తి చేయాలి

* ప‌నుల పురోగ‌తిపై సీఎం చంద్ర‌బాబు స‌మీక్ష‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల పురోగతిపై సీఎం చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం అమ‌రావ‌తిలో జ‌రిగిన క్యాబినెట్ మీటింగ్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి 31 నాటి collector_inspect_durga_flyover_27-12-16_3కల్లా ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థకు, అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పనులు వేగవంతం చేసేందుకు ఈ నెల 11న ఉదయం 6 గంటల నుంచి డిసెంబర్ 31 వరకు దుర్గగుడి రహదారిని మూసివేయాలని ఈ సంద‌ర్భంగా సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. దసరా శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని ఈనెల 20 నుంచి 30 వరకు నడకదారి భక్తులకు అనుమతి ఇవ్వాల‌ని అధికారులకు చంద్ర‌బాబు స్పష్టం చేశారు. దుర్గగుడి రహదారి మూసివేయనుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు అభివృద్ధి చేయాల‌ని, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సమర్ధవంతంగా జరగాల‌ని అధికారుల‌కు సూచించారు. అద‌న‌పు సిబ్బందిని ఏర్పాటు చేసి రేయింబ‌వ‌ళ్లు పైవంతెన ప‌నుల‌ను వేగవంతం చేయాల‌న్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చేలా పనుల్లో జాప్యం జ‌రిగితే కఠిన చర్యలు తీసుకుంటాం అని పైవంతెన నిర్మాణ సంస్థ సోమా ప్రతినిధులకు ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి చంద్ర‌బాబు హెచ్చరించారు.

Just In...