Published On: Tue, Mar 27th, 2018

2019కల్లా ఐటీలో లక్ష ఉద్యోగాలు

 శాస‌న‌మండ‌లిలో మంత్రి నారా లేకేష్‌

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తోందని రాష్ట్ర గ్రామీణ‌, పంచాయ‌తీరాజ్‌, ఐటీ శాఖల‌ మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. విశాఖపట్టణంలో ఐటీ టవర్ల నిర్మాణానికి సంబంధించి ఎమ్మెల్సీ మూర్తి మంగ‌ళ‌వారం ఉద‌యం శాసనమండలిలో అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేష్ సమాధామనమిచ్చారు. లోకేష్ మాట్లాడుతూ 2019కల్లా రాష్ట్రంలో లక్షమందికి ఐటీ ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఐటీ టవర్ల నిర్మాణం చేపట్టినట్లు స‌భ‌కు వివరించారు. ప్రత్యేక పాలసీ ద్వారా ఐటీ కంపెనీలకు 50శాతం అద్దె ప్రభుత్వమే చెల్లింస్తోందని పేర్కొన్నారు. విశాఖప‌ట్నంలో 20లక్షల చదరపు అడుగుల్లో భవనాలు నిర్మించేందుకు ఉడా తరపున చర్యలు చేపట్టినట్లు మంత్రి లోకేష్ స‌భ‌కు వెల్లడించారు.

Just In...