Published On: Tue, Jun 12th, 2018

2019 నాటికి పోలవరం పూర్తిచేసి తీరుతాం

* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు

* డ‌యాఫ్రం వాల్ నిర్మాణం జాతికి అంకితం 

సెల్ఐటి న్యూస్‌, పోలవరం: అభివృద్ధిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌రో ముంద‌డుగు వేసింది. ఆంధ్రుల జీవ‌నాడి అయిన పోల‌వ‌రం ప్రాజెక్టులో మ‌రో అంశం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు భ‌రోసా ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన డయాఫ్రం వాల్‌ పూర్తయిన సందర్భంగా ముఖ్య‌మంత్రి చంద్రబాబునాయుడు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి డ‌యాఫం వాల్ నిర్మాణాన్ని జాతికి అంకితం చేశారు. పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కార్మికులు, ఇంజినీర్లు, గుత్తేదారులను ఆయ‌న అభినందించారు. ఈ సంద‌ర్భంగా స్పిల్‌ ఛానల్‌ వద్ద 13 జిల్లాల రైతులతో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం చంద్ర‌బాబు పాల్గొని మాట్లాడారు. ఎవ‌రెన్ని అడ్డంకులు సృష్టించాల‌ని చూసినా వాటిని అధిగ‌మించి 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ‘పోలవరం నిర్మాణంలో డయాఫ్రంవాల్‌ పూర్తిచేయడం ఓ చరిత్ర అన్నారు. పోలవరం పూర్తయితే 7 లక్షల ఎకరాలకు నీరందుతుంది. ఎవరెన్ని అడ్డంకులు పెట్టినా సకాలంలో ప్రాజెక్టు పూర్తి చేస్తాం. దేశంలో రెండు నదులను అనుసంధానం చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే. త్వరలోనే వంశధార, నాగావళి, పెన్నా, గోదావరి నదులను అనుసంధానం చేస్తాం. నదుల అనుసంధానంతో నీటి కరువును పారదోలాలి. వర్షపు నీటిని భూగర్భ జలంగా మార్చుకోవాలి’ అని అన్నారు. కార్య‌క్ర‌మంలో రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, పితాని స‌త్య‌నారాయ‌ణ‌, ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

Just In...