Published On: Wed, Mar 20th, 2019

22న ప‌శ్చిమ స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా కోరాడ నామినేష‌న్

* భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ (పాత‌బ‌స్తీ): ఈ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా .స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న తాను ఈ నెల 22న (శుక్ర‌వారం)  నామినేష‌న్ వేయ‌నున్న‌ట్లు కోరాడ ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ కోరాడ విజ‌య్‌కుమార్ తెలిపారు. బుధ‌వారం పాత‌బ‌స్తీలోని జెండాచెట్టు వీధిలో ఉన్న త‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో కోరాడ విజ‌య్‌కుమార్ మాట్లాడుతూ 22న మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు చిట్టిన‌గ‌ర్ మ‌హాల‌క్ష్మీ అమ్మ‌వారి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు అనంత‌రం ర్యాలీగా బ‌య‌లుదేరి చిట్టిన‌గ‌ర్ మీదుగా వాగుసెంట‌ర్‌, శ్రీనివాస్‌మ‌హ‌ల్‌, బ్రాహ్మ‌ణ‌వీధి మీదుగా కెనాల్ రోడ్డుకు చేరుకుని  మోడ‌ల్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఆర్వో కార్యాల‌యంలో నామినేష‌న్ వేస్తున్న‌ట్లు చెప్పారు. అభిమానులు, శ్రేయోభిలాషులు, కార్య‌క‌ర్త‌లు భారీగా త‌ర‌లివ‌చ్చి నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో పాల్గొని త‌న విజ‌యానికి తోడ్ప‌డాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీకి చెందిన ప్ర‌జ‌ల్లో పేద‌లు ఎక్కువ‌గా ఉన్నార‌ని వారంద‌రికీ కోరాడ ఫౌండేష‌న్ త‌ర‌ఫున ఏడాదిన్న‌ర కాలంలో స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తూ వెన్నుద‌న్నుగా ఉంటున్నామ‌ని తెలిపారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఏ డివిజ‌న్‌కు వెళ్లినా కూడా ప్ర‌జ‌లు స్థానికంగా నెల‌కొన్న అనేక ఇబ్బందుల‌ను త‌న దృష్టికి తీసుకువ‌స్తున్నార‌ని, అభివృద్ధిలో ఎక్క‌డా పురోగ‌తి లేద‌ని పేర్కొంటూ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నార‌ని తెలిపారు. ఈ ఎన్నిక‌ల్లో త‌న‌కు అవ‌కాశం ఇస్తామ‌ని త‌న‌కు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామ‌ని ప్ర‌జ‌లు చెబుతున్న మాట‌లు త‌న‌కు గెలుపుపై న‌మ్మ‌కాన్ని, విశ్వాసాన్ని పెంచాయ‌న్నారు. ఈ క్ర‌మంలో అభివృద్ధే ల‌క్ష్యంగా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన త‌న‌కు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు త‌న గెలుపు వారి గెలుపుగా భావించి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని, భారీ మెజారిటీతో గెలిపించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధాన పార్టీల‌తో స‌మానంగా ప్రచారం సాగిస్తూ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగిన త‌న‌కు నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు అండ‌గా ఉంటార‌ని, రాబోయే ఎన్నిక‌ల్లో త‌న గెలుపు ఖాయ‌మ‌ని ఈ సంద‌ర్భంగా విజ‌య్‌కుమార్ ఆశాభావం వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీల నుంచి సంఘాల నాయ‌కులు కోరాడ విజ‌య్‌కుమార్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. విలేక‌రుల స‌మావేశంలో మాజీ కార్పోరేట‌ర్ నూక‌ల నాగేశ్వ‌ర‌రావు, నాయ‌కులు బాడిత శంక‌ర్‌, పోతిన బేసుకంటేశ్వ‌రుడు, అప్స‌ర్‌, ప‌ట్నాల హ‌రిబాబు, క‌ట్టా స‌త్తి, తంగిరాల కృప‌, పీతా బుజ్జి, అప్పిక‌ట్ల జ‌వ‌హ‌ర్‌, న‌మ్మి భాను, దేవ‌ర సురేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Just In...