Published On: Wed, May 22nd, 2019

23న ఎన్నిక‌ల ఫ‌లితాలు…)

* న్యాయ‌వాదుల కోసం ప్ర‌త్యేక ఏర్పాట్లు

* బీబీఏ అధ్య‌క్షుడు పోపూరి ల‌క్ష్మీకాంత్ వెల్ల‌డి

సెల్ఐటి న్యూస్‌, విజ‌య‌వాడ లీగ‌ల్‌: దేశ భ‌విష్య‌త్‌ను నిర్దేశించే ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఈ నెల 23న వెలువ‌డ‌నున్న విజేత‌ల వివ‌రాల‌ను తెలుసుకునేందుకు సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పాటు న్యాయ‌వాదుల్లో కూడా ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొంది. ఇందుకు త‌గిన విధంగా ప్ర‌త్యేక ఏర్పాట్లు కూడా బెజ‌వాడ బార్ అసోసియేష‌న్ (బీబీఏ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేర‌కు బీబీఏ అధ్య‌క్షుడు పోపూరి ల‌క్ష్మీకాంత్ మంగ‌ళ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గ‌వ‌ర్న‌రుపేట‌లోని సివిల్ కోర్టుల ప్రాంగ‌ణంలో ఉన్న అసోసియేష‌న్ హాల్‌లో ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన తెర‌పై ఎన్నిక‌ల ఫ‌లితాలను న్యాయ‌వాదులు ప్ర‌త్య‌క్షంగా తిల‌కించేందుకు సౌక‌ర్య‌వంతంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు ల‌క్ష్మీకాంత్ పేర్కొన్నారు. న్యాయ‌వాదులంద‌రూ ఈ అవ‌కాశాన్ని వినియోగించుకోవాల‌ని బీబీఏ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వై.వి.సి.హెచ్‌.రాజ‌శేఖ‌ర్ తెలిపారు.

Just In...