Published On: Mon, Jun 25th, 2018

26న చీమ‌కుర్తిలో అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం

* సీఎం చంద్ర‌బాబును ఆహ్వానించిన‌ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి:  శిద్దా వెంకటేశ్వర్లు-వెంకటసుబ్బమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుండి 30వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చీమకుర్తి హరిహర క్షేత్రంలో శ్రీ హరిహర క్షేత్ర అష్టబంధన మహాకుంభాభిషేక మహోత్సవం జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కావాల‌ని కోరుతూ రాష్ట్ర అట‌వీ శాఖ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని వెలగపూడి సచివాలయంలో శ‌నివారం ఉదయం కలసి ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రికి ఆహ్వ‌న‌ప‌త్రం అంద‌జేశారు.

Just In...