Published On: Wed, Nov 20th, 2019

27న తిరుమలలో శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు…

సెల్ఐటి న్యూస్‌, తిరుమ‌ల‌: పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సంద‌ర్భంగా ఈ నెల 27న తిరుమల శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు జరుగనుంది. శ్రీవారి ఆభరణాలలో అత్యంత ప్రధానమైన లక్మీకాసుల హారం ఉద‌యం 8 గంట‌ల నుండి 9.00 గంట‌ల వ‌ర‌కు తిరుమ‌ల‌లోని ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో ఊరేగించ‌నున్నారు. అనంత‌రం ఈ హారాన్ని అధికారులు ఉదయం 9 గంటలకు తిరుమలలో బయల్దేరి, తిరుచానూరులోని పసుపు మండపానికి తీసుకొస్తారు. అనంతరం ప‌సుపు మండ‌పం నుంచి మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటల మధ్య శోభాయాత్రగా అమ్మవారి ఆలయానికి తీసుకెళతారు. 27న సాయంత్రం జరిగే గజవాహన సేవలో అమ్మవారికి ఈ లక్ష్మీకాసుల హారాన్ని అలంకరిస్తారు. శ్రీవారి కాసులహారాన్ని ప్రతి ఏటా గజవాహన సేవ రోజు అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.

Just In...