Published On: Thu, Mar 26th, 2020

4 రోజుల్లో 350 ఆటోలు సీజ్ చేసాం

* టీటీసీ వెంకటేశ్వరరావు

విజ‌య‌వాడ‌, సెల్ఐటి న్యూస్ క్రైం: కరోనా వైరస్ కేసులు జిల్లాలో అరికట్టి వ్యాధిని నివారించేందుకు భారత పౌరులుగా తమవంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ  సహకరించాలని ఇంటి నుండి రోడ్డుపైకి రావడం గాని, ప్రయాణాలు చెయ్యడం గాని చేయొద్దని టాక్సీలు, ఆటోలు ఇంటి నుండి బయటకు తీయొద్దని డిటిసి ఎస్.వెంకటేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా గురువారం ఆయ‌న పత్రికా ప్రకటనను విడుదల చేశారు. కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సామాజిక దూరం పాటించాలని, ఇంటి నుండి ఎవరిని బయటకు రావద్దని, ప్రజా రవాణా వాహనాలతో సహా అన్నింటినీ నిలుపుదల చెయ్యాలని కోరడం జరిగిందన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు జిల్లాను లాక్ డౌన్  గా ప్రకటించినప్పటికి ప్రయాణీకులు ఆటోలలో ఎక్కడం, ప్రయాణించడం  గమనిస్తున్నామని ఆయన తెలిపారు. కరోనా వ్యాధిని నియంత్రించే విధంగా రవాణా వాహనాలు రోడ్లపై తిరగరాదని నిబంధనలు పెట్టినప్పటికి నిబంధనలు పాటించకుండా జిల్లాలో తిరుగుతూ పట్టుబడ్డ 350 ఆటోలను ఈ నాలుగు రోజులలో సీజ్ చెయ్యడం జరిగిందని ఆయన తెలిపారు. ఆటో, టాక్సీ మొదలు రవాణా వాహనాలన్నీ  పూర్తి స్థాయిలో నిలుపుదల చేయాలని ఆయన కోరారు. అత్యవసర సేవాల వినియోగానికి కేటాయించిన వాహనాలు తప్ప ఏఇతర వాహనాలు నడపారాదని ఆయన ఆన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 14 తనిఖీ బృందాలను ఏర్పాటు చేశామని, తనిఖీలు ఎప్పటికప్పుడు ముమ్మరం చేస్తున్నామని, తనిఖీలలో పట్టుబడిన వాహనాలు సీజ్ చేసి ప్రభుత్వం మరల ఆదేశాలు జారీ చేసేవరకు వాహనాలను వదలమని స్పష్టం చేశారు. అంబులెన్స్ లలో వాటర్ ట్యాంక్ లారీలలో ప్రయాణికులను తీసుకెళ్తునట్లు సోషల్ మీడియాలో చూడటం జరిగిందని, అలా చేస్తే వాహనం పైన యజమాని పైన కూడా కేసులు పెడతామని హెచ్చరికలు జారీ చేశారు. మోటారు వాహనాల చట్టం ప్రకారం మరియు మహమ్మారి వ్యాధుల చట్టం ప్రకారం వాహనాలపై కేసులు రాసి సీజ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఆటోలు టాక్సీలు స్వచ్ఛందంగా నిలుపుదల చేయాలని కరోనా వ్యాధి మనుషుల నుండి మనుషులకు సంక్రమించే వ్యాదని ఆయన తెలిపారు. ప్రయాణికులను ఆటోలలో ఎక్కించుకొవడం ద్వారా వ్యాధి ఉన్న ప్రయాణికుడు నుండి ఇతరులకు వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు.  మనిషీ బ్రతికుంటే డబ్బు అనేది రేపైన సంపాదించుకోవచ్చని, కానీ సంపాదనకు ఇది సమయం కాదని ఆటో యజమానులకు, డ్రైవర్లకు చెప్పారు.

Just In...