Published On: Mon, Nov 20th, 2017

40 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో ఇలాంటి సంతృప్తి పొంద‌లేదు

* ఉపాధి హామీ నిధుల వినియోగంపై శాస‌న‌స‌భ‌లో సీఎం చంద్ర‌బాబు

సెల్ఐటి న్యూస్‌, అమరావతి: ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయేలా అభివృద్ధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉపాధి హామీ నిధుల వినియోగంపై శాసనసభలో సోమ‌వారం ఆయన వివరణ ఇచ్చారు. ‘ఉపాధి హామీ కింద రూ.16,572 కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. ఈ పథకం కింద పలు నిర్మాణాలు చేపట్టామ‌ని, గ్రామాల్లో ఇంకా 18వేల కిలోమీటర్ల మేర రహదారులు నిర్మించాల్సి ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో అన్ని గ్రామాల్లో నూటికి నూరు శాతం సిమెంట్‌ రహదారులు, పంచాయతీ భవనాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. క్రీడా మైదానాలు అభివృద్ధి చేయాల‌న్నారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినేలా వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఈ సంద‌ర్భంగా చంద్రబాబు విమర్శించారు. ప్రజలు వైసీపీ నేతలను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరన్నారు. 2018 నవంబర్‌ నాటికి 30లక్షల ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. విభజన హామీలు ఇంకా పెండింగ్‌లో ఉన్నప్పటికీ కేంద్రం వాటిపై సానుకూలంగా ఉందన్నారు. తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఈ నాలుగేళ్లలో పొందిన సంతృప్తి గతంలో ఎన్నడూ లేదని సీఎం చంద్ర‌బాబు స‌భ‌కు వివ‌రించారు. ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి సమస్యలను పరిష్కరించడంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు.

Just In...